“సైరా”తో.. నా కల నెరవేరింది.. చిరంజీవి భావోద్వేగం

|

Oct 03, 2019 | 4:42 PM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. బుధవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ మూవీ అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని హీరో రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించడం జరిగింది. ప్రీమియర్ షో నుంచి […]

సైరాతో.. నా కల నెరవేరింది.. చిరంజీవి భావోద్వేగం
Follow us on

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. బుధవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ మూవీ అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని హీరో రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించడం జరిగింది. ప్రీమియర్ షో నుంచి హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బ్లాక్‌బస్టర్ దిశగా వెళ్తోంది. దీంతో ‘సైరా’ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఇవాళ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్, సురేందర్ రెడ్డి, తమన్నా, పరుచూరి బ్రదర్స్, దిల్ రాజు, రత్నవేలు తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రంలో తాను నటించడం ఎంతో సంతోషంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి తన ఆనందాన్ని పంచుకున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ పన్నెండేళ్ల క్రిందట మొదలైందన్నారు. ‘సైరా’ కంటే ముందు ఓ స్వాతంత్ర్య సమరయోధుడి పాత్ర చేయాలని.. అది నా కెరీర్ బెస్ట్ రోల్ అవ్వాలని అనుకుంటూ ఉన్నానని.. నా డ్రీం రోల్ భగత్ సింగ్ అని కూడా చెప్పానన్నారు. అయితే సరిగ్గా పన్నెండు సంవత్సరాల క్రితం పరుచూరి సోదరులు తనకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను చెప్పడం జరిగిందని.. చాలా ఎగ్జైట్‌మెంట్ ఫీల్ అయ్యానని అన్నారు. అయితే ఇది వెండితెర మీద చూపించాలంటే భారీ బడ్జెట్ అవసరమవుతుందని.. ఎక్కడా కూడా కాంప్రమైస్ కాకూడదనే ఉద్దేశంతో వాయిదా వేసుకుంటూ వచ్చామన్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా ఈ సినిమాపై అందరం కష్టపడ్డామని.. ఇప్పుడు ఆ ప్రయత్నానికి తగిన ఫలితం రావడంతో తమకు చాలా సంతోషంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.

దర్శకుడు నుంచి నటీనటుల వరకు అందరూ కూడా ప్రాణం పెట్టి ఈ సినిమాకు పని చేశారని చిరంజీవి అన్నారు. అంతేకాక ‘లక్ష్మీ’ పాత్రలో నటించిన తమన్నాకు వస్తున్న గుర్తింపు తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర తెరమరుగు కాకూడదని.. ప్రపంచంలో ఉన్న భారతీయులు అందరూ ఆయన గొప్పతనం గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో సినిమాగా తెరకెక్కించామని.. అందులో మేమందరం భాగం కావడం చాలా గర్వంగా ఉందని చిరంజీవి అన్నారు.

మరోవైపు రిలీజ్‌కి ఒక్క రోజు ముందు చూసిన ప్రెస్ వాళ్ళు సినిమా చూసి చాలా ఆశ్చర్యపోయారని అన్నారు. సినిమా పూర్తయిన తర్వాత వారు చేసిన ట్వీట్స్ చూసి చాలా సంతోషపడ్డాడని చిరంజీవి తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు గురించి చిరంజీవి ఏమన్నారో ఆయన మాటల్లోనే..