‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస’ను ప్రారంభించిన నిత్యానంద..

|

Aug 22, 2020 | 12:09 PM

వివాదాస్పద స్వామిజీ నిత్యానంద సొంత బ్యాంక్‌ని ఏర్పాటు చేశారు. ఇవాళ తన దేశంగా చెప్పుకుంటున్న కైలాస ద్వీపంలో 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస'ను ప్రారంభించారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాసను ప్రారంభించిన నిత్యానంద..
Nithyananda
Follow us on

Reserve Bank Of Kailasha: వివాదాస్పద స్వామిజీ నిత్యానంద సొంత బ్యాంక్‌ని ఏర్పాటు చేశారు. ఇవాళ తన దేశంగా చెప్పుకుంటున్న కైలాస ద్వీపంలో ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస’ను ప్రారంభించారు. అంతేకాకుండా కైలాస దేశానికి సంబంధించిన నాణేలను కూడా విడుదల చేశారు. ఆర్బీకే నాణేలు బంగారంతో చేసినవి అని నిత్యానంద ప్రకటించారు.

అటు ఏ దేశ కరెన్సీ అయినా కైలాస దేశంలో చెల్లుబాటు అవుతుందని, అలాగే కైలాస దేశం కరెన్సీ కూడా అన్ని దేశాల్లో చెల్లుబాటు అవుతుందని వెల్లడించారు. ఇందుకు సంబంధించి పలు దేశాల బ్యాంకులతో చట్టబద్దంగా ఎంఓయూ కుదుర్చుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సంపూర్ణ హిందూ ధర్మాన్ని నెలకొల్పడమే తన లక్ష్యమని పేర్కొన్న నిత్యానంద.. దానికోసం చివరి వరకు పోరాడతానని చెప్పుకొచ్చాడు. భారత్‌లో ఇప్పుడు తనకు అనుమానాతి లేదని.. అయినా కూడా తాను జీవ సమాధి అయ్యేది బెంగుళూరులోని బిడది ఆశ్రమంలోనే అని నిత్యానంద వెల్లడించారు.

Also Read: రిలాక్స్ మోడ్‌లోకి కిమ్.. సోదరికి అధ్యక్ష పదవి పగ్గాలు..!