కిమ్ రిలాక్స్ మోడ్.. సోదరికి కీలక బాధ్యతలు అప్పగింత.!

ఆధునిక నియంత కిమ్ జోంగ్ ఉన్ తొందరలోనే అధ్యక్ష పదవి నుంచి తప్పుకోబోతున్నారా.? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఉత్తర కొరియాలో మారుతున్న పరిణామాలు చూస్తుంటే..

కిమ్ రిలాక్స్ మోడ్.. సోదరికి కీలక బాధ్యతలు అప్పగింత.!
Follow us

|

Updated on: Aug 22, 2020 | 7:03 PM

Kim Jong Un Promotes His Sister: ఆధునిక నియంత కిమ్ జోంగ్ ఉన్ తొందరలోనే అధ్యక్ష పదవి నుంచి తప్పుకోబోతున్నారా.? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఉత్తర కొరియాలో మారుతున్న పరిణామాలు చూస్తుంటే కిమ్ రిలాక్స్ మోడ్‌లోకి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన సోదరి కిమ్ యో జోంగ్‌కు కొన్ని కీలక బాధ్యతలను కిమ్ అప్పజెప్పినట్లు దక్షిణ కొరియా నిఘా సంస్థ గుర్తించింది.

కిమ్ తన అధికారాల్లో సగం వరకూ తన సోదరికి బదిలీ చేశారని తెలుస్తోంది.. విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సైనిక రంగాలను కిమ్‌ యో జాంగ్‌ పర్యవేక్షించనున్నారు. కిమ్ అనారోగ్యం కారణంగా పని భారాన్ని తగ్గించుకుకోవడంతో పాటు సోదరిని రెండో అధికార కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారని చెబుతున్నారు. అమెరికా, దక్షిణ కొరియాతో సంబంధాల వ్యవహారాలన్నీ ఇక పై జాంగ్‌ పర్యవేక్షిస్తారు. ఆమెను వారసురాలిగా ఎంపిక చేయకపోయినా.. పరోక్షంగా ఉత్తర కొరియాకు మున్ముందు కిమ్ యో జోంగ్ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టనుందని దక్షిణ కొరియా నిఘా వర్గాలు పేర్కొన్నాయి. కాగా, కిమ్‌కు అత్యంత సన్నిహితురాలు కిమ్ యో జోంగ్. తన పొలిటికల్ బ్యూరోలో కిమ్ నమ్మేది ఆమెనే. అంతేకాకుండా కిమ్‌కు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఆమె దగ్గరుంది పర్యవేక్షిస్తుంది. 

Also Read: చైనా కరోనా వ్యాక్సిన్ ధర రూ. 10 వేలు..!