Komuravelli Mallanna: నేటి నుంచి సిద్దిపేట కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఆదివారం స్వామివారికి కళ్యాణోత్సవం, దృష్టికుంభం, బలిహారణం, శకటోత్సవం నిర్వహించనున్నారు. కాగా, ఈనెల 11న ఏకదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
కోవిడ్ నిబంధనలు అనుసరించి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కరోనా మహ్మారి కారణంగా ఆలయానికి వచ్చే భక్తులు తప్పకుండా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని నిర్వాహకులు కోరుతున్నారు.