రియా సోదరుడు, సహాయకుడికి ఎన్‌సీబీ స‌మ‌న్లు

బాలీవుడ్ యువ న‌టుడు స‌శాంత్ సింగ్ మ‌ర‌ణం విష‌యంలో ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ కేసులో సుశాంత్ గ‌ర్ల్‌ఫ్రెండ్ రియా ప‌లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటుంది.

రియా సోదరుడు, సహాయకుడికి  ఎన్‌సీబీ స‌మ‌న్లు

Updated on: Sep 04, 2020 | 3:07 PM

బాలీవుడ్ యువ న‌టుడు స‌శాంత్ సింగ్ మ‌ర‌ణం విష‌యంలో ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ కేసులో సుశాంత్ గ‌ర్ల్‌ఫ్రెండ్ రియా ప‌లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటుంది. కేసు విచార‌ణ‌లో భాగంగా బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం కూడా వెలుగులోకి వ‌చ్చింది. తాజాగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు శుక్రవారం, రియా చక్రవర్తితోపాటు ఆమె సహాయకుడు శామ్యూల్ మిరండా ఇంట్లో సోదాలు చేశారు. అనంతరం శామ్యూల్​తో పాటు రియా సోదరుడు సోవిక్​ను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్ద‌రికీ స‌మన్లు జారీ చేసిన ఎన్‌సీబీ, ప‌లు కీల‌క అంశాల‌కు సంబంధించి ఇంట్రాగేష‌న్ చేస్తోంది. ఇక‌ షోవిక్‌ చక్రవర్తి, శామ్యూల్‌ మిరండాలకు డ్రగ్స్‌ అందించినట్లుగా అనుమానిస్తున్న అబ్దుల్ బాసిత్, జైద్‌ విల్తారా అనే ఇద్దరు వ్యక్తులను ఎన్‌సీబీ ఇప్ప‌టికే అరెస్టు చేసింది.

కాగా డ్రగ్‌ డీలర్‌తో రియా చక్రవర్తి సంభాషణ జరిపినట్లుగా ఉన్న వాట్సాప్‌ చాట్ స‌ర్కులేట్ అయిన‌ సంగతి తెలిసిందే. తద్వారా నిషేధిత డ్రగ్స్‌ గురించి ఆమె ప‌లువురితో చర్చించినట్లు వెల్లడైంది. దీంతో నార్కోటిక్స్ అధికారులు సుశాంత్ కేసులో డ్ర‌గ్స్ కోణంపై మ‌రింత ఫోక‌స్ పెట్టారు.

Also Read :

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఇంట విషాదం

కేజీ చేప‌లు రూ.10 : అయినా కొనుగోలు చేయ‌ని ప్ర‌జ‌లు !