సూరత్ ఘటనపై మోదీ, రాహుల్ రెస్పాన్స్..!

| Edited By:

May 25, 2019 | 11:21 AM

సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ కోచింగ్ సెంటర్‌లో మంటలు అంటుకొని 20 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు గుజరాత్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా స్పందించారు. మృతుల కుటుంబాలకు ట్విట్టర్ ద్వారా తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సర్తానా ప్రాంతంలోని కోచింగ్ సెంటర్ ముందున్న ట్రాన్స్ ఫార్మర్ నుంచి మంటలు చెలరేగి అపార్ట్‌మెంట్‌కు అంటుకున్నాయి. దీంతో […]

సూరత్ ఘటనపై మోదీ, రాహుల్ రెస్పాన్స్..!
Follow us on

సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ కోచింగ్ సెంటర్‌లో మంటలు అంటుకొని 20 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు గుజరాత్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా స్పందించారు. మృతుల కుటుంబాలకు ట్విట్టర్ ద్వారా తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సర్తానా ప్రాంతంలోని కోచింగ్ సెంటర్ ముందున్న ట్రాన్స్ ఫార్మర్ నుంచి మంటలు చెలరేగి అపార్ట్‌మెంట్‌కు అంటుకున్నాయి. దీంతో నిమిషాల వ్యవధిలోనే మంటలు పై అంతస్థుకు వ్యాపించాయి. మంటల్లోంచి బయటపడేందుకు విద్యార్థులు కోచింగ్ సెంటర్ భవనం పై నుంచి కిందకు దూకారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది స్పాట్‌కు చేరుకున్నారు. 20 ఫైర్ ఇంజన్లతో మంటల్ని అతికష్టం మీద అదుపు చేశారు.

అగ్నిప్రమాదంలో మృతులతో పాటు 20 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొంతమందిని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది గుజరాత్ ప్రభుత్వం.