సుప్రీంలో కర్నాటక రాజకీయం.. నేడే రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్ పై విచారణ
ఎన్నో ట్విస్టుల మధ్య సాగిన కర్నాటక రాజకీయం సుప్రీం కోర్టుకు చేరింది. రెబల్ ఎమ్మెల్యేల రాజీనామా ఆమోద వ్యాజ్యాలపై నేడు సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో మొత్తం 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వీరిలో 10 మంది శాసనసభ్యులు తమ రాజీనామాలను ఆమోదించేలా స్పీకర్ ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంను ఆశ్రయించారు. వీరితో పాటు మరో ఐదుగురు కూడా సుప్రీంను ఆశ్రయించారు. వీరి రాజీనామాల ఆమోద వ్యాజ్యాలపై నేడు వాదనలు విననుంది అత్యున్నత న్యాయస్థానం. […]
ఎన్నో ట్విస్టుల మధ్య సాగిన కర్నాటక రాజకీయం సుప్రీం కోర్టుకు చేరింది. రెబల్ ఎమ్మెల్యేల రాజీనామా ఆమోద వ్యాజ్యాలపై నేడు సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో మొత్తం 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వీరిలో 10 మంది శాసనసభ్యులు తమ రాజీనామాలను ఆమోదించేలా స్పీకర్ ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంను ఆశ్రయించారు. వీరితో పాటు మరో ఐదుగురు కూడా సుప్రీంను ఆశ్రయించారు. వీరి రాజీనామాల ఆమోద వ్యాజ్యాలపై నేడు వాదనలు విననుంది అత్యున్నత న్యాయస్థానం. అయితే 16 మందిలో కాంగ్రెస్ నుంచి 13, జేడీఎస్ నుంచి ముగ్గురు శాసనసభ్యులు ఉన్నారు. మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు శంకర్, నగేశ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు.
16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కుమారస్వామి బల నిరూపణ చేసుకోవాలని బీజేపీ పట్టుబట్టింది. సోమవారం కర్ణాటక విధాన సభలో సంకీర్ణ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టింది. గురువారం ఉదయం 11 గంటలకు తీర్మానంపై చర్చ జరగనుంది. ఇక నాలుగు రోజుల్లో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వానికి శాసససభలో మెజారిటీ తగ్గనుందని ప్రతిపక్ష నేత యడ్యూరప్ప ప్రకటించారు. ఫలితంగా ఈ మూడు రోజుల్లో కుమారస్వామి ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఆ తర్వాత బీజేపీదే అధికారమని ధీమావ్యక్తం చేశారు.