నిర్భయ దోషి పిటిషన్‌.. నేడు సుప్రీంలో విచారణ..

| Edited By: Srinu

Jan 28, 2020 | 1:50 PM

నిర్భయ దోషి ముకేశ్‌ సింగ్‌ పిటిషన్ ను జనవరి 28 న సుప్రీంకోర్టు విచారించనుంది. తన పిటిషన్‌ను వెంటనే విచారణ చెయ్యాలని ముకేశ్‌ సింగ్‌ సుప్రీంకోర్టును అభ్యర్థించాడు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బోబ్డేతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం స్పందించింది. కోర్టు రిజిస్ట్రరీలో ఈ పిటిషన్‌ చేర్చమని అతడి తరఫు న్యాయవాదికి సీజేఐ సూచించారు. ఉరిశిక్ష పడిన వ్యక్తి పిటిషన్‌ విచారణకు మించి అత్యవసరమైనది ఏదీ లేదని ఆయన అన్నారు. అతడి క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి […]

నిర్భయ దోషి పిటిషన్‌.. నేడు సుప్రీంలో విచారణ..
Follow us on

నిర్భయ దోషి ముకేశ్‌ సింగ్‌ పిటిషన్ ను జనవరి 28 న సుప్రీంకోర్టు విచారించనుంది. తన పిటిషన్‌ను వెంటనే విచారణ చెయ్యాలని ముకేశ్‌ సింగ్‌ సుప్రీంకోర్టును అభ్యర్థించాడు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బోబ్డేతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం స్పందించింది. కోర్టు రిజిస్ట్రరీలో ఈ పిటిషన్‌ చేర్చమని అతడి తరఫు న్యాయవాదికి సీజేఐ సూచించారు. ఉరిశిక్ష పడిన వ్యక్తి పిటిషన్‌ విచారణకు మించి అత్యవసరమైనది ఏదీ లేదని ఆయన అన్నారు. అతడి క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈనెల 17న తిరస్కరించారు. దీనిపై ఆర్థికల్‌ 32 కింద న్యాయపరమైన రివ్యూ కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశాడు.

కాగా.. నిర్భయ దోషులను ఫిబ్రవరి 1 ఉదయం ఆరు గంటలకు ఉరి తీయాల్సిందిగా ఢిల్లీ న్యాయస్థానం డెత్‌ వారెంట్‌ జారీ చేసింది. వీరిని జనవరి 22నే ఉరితీయాల్సి ఉండగా ముకేశ్‌ క్షమాభిక్ష అభ్యర్థనతో శిక్ష అమలు వాయిదా పడింది. దీంతో వారికి రెండోసారి డెత్‌ వారెంట్‌ జారీ చేశారు. శిక్ష అమలుకు వారం రోజులు సమయం కూడా లేని సమయంలో ముకేశ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించడం గమనార్హం.

[svt-event date=”27/01/2020,10:40PM” class=”svt-cd-green” ]