లాక్‌డౌన్‌ మిగిల్చిన విషాదం.. వాణిజ్య రాజధానిలో ఈ ఏడాది 938 ఆత్మహత్యలు

|

Dec 19, 2020 | 4:11 PM

ముంబై: దేశ వాణిజ్య రాజధానిలో ఈ ఏడాదిలో ఇప్పటివరకు 900కు పైగా మంది బలవన్మరణానికి పాల్పడ్డారని ముంబై పోలీసులు తెలిపారు. గతంలో నగరంలో నమోదైన మొత్తం కేసులతో పోలిస్తే ఆత్మహత్య కేసుల్లో ఈసారి 14 శాతం మేర తగ్గుదల నమోదైందని వెల్లడించారు. ఈ మేరకు నివేదిక విడుదల చేశారు.

లాక్‌డౌన్‌  మిగిల్చిన విషాదం.. వాణిజ్య రాజధానిలో ఈ ఏడాది 938 ఆత్మహత్యలు
Follow us on

ముంబై: దేశ వాణిజ్య రాజధానిలో ఈ ఏడాదిలో ఇప్పటివరకు 900కు పైగా మంది బలవన్మరణానికి పాల్పడ్డారని ముంబై పోలీసులు తెలిపారు. గతంలో నగరంలో నమోదైన మొత్తం కేసులతో పోలిస్తే ఆత్మహత్య కేసుల్లో ఈసారి 14 శాతం మేర తగ్గుదల నమోదైందని వెల్లడించారు. ఈ మేరకు నివేదిక విడుదల చేశారు.

పోలీసులు విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ మధ్య ముంబైలో 938 మందికి పైగా పురుషులు, మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. బాధితుల్లో యువత ఎక్కువ శాతం అంటే 36% గా ఉండగా, 10% మంది సీనియర్ సిటిజన్లు ఉన్నారు. వీరిలో 19-30 ఏళ్ల వయస్సు గల వారి సంఖ్య ఎక్కువగా ఉండగా.. వృద్దుల సంఖ్య 10 శాతంగా నమోదైంది. మొత్తం 928 మరణాలలో 371 మంది మార్చి నుంచి జూలై మధ్యకాలంలోనే బలవన్మరణాలకు పాల్పడ్డారు. వీరంతా కూడా పూర్తి లాక్‌డౌన్‌ సమయంలో సంభవించినట్లు నివేదిక తెలుపుతుంది. కాగా గత ఏడాది జనవరి- నవంబర్ 2019 మధ్య జరగిన ఆత్మహత్యలు 1,075 మరణాల కంటే 14% తక్కువ.

19-30 సంవత్సరాల వయస్సులో ఉన్న యువతీ యువకులు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే వారిలో చాలామంది వివిధ నగరాల్లో, కుటుంబాలకు దూరంగా, విద్య కోసం పని కోసం లాక్‌డౌన్‌ సమయంలో చిక్కుకున్నారు. ఆర్థిక నష్టాల కారణంగా కంపెనీలు ఉద్యోగులను తొలగించడం, కొత్తగా ఉపాధి లేకపోవడంతో కొందరు తమ కెరీర్‌లో మానసికంగా కృంగిపోయారు. సామాజిక మద్దతు లేకపోవడం, ఒంటరితనం, ఆర్థిక సమస్యలు యువకులను మానసిక ఒత్తిడికి గురై బలవన్మరణానికి పాల్పడ్డారని కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ అవినాష్ డి సౌసా అన్నారు. అంతేకాకుండా మానవ సంబంధాలు దెబ్బతినడం కూడా ఆత్మహత్యలకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. సమస్యను వెంటనే గుర్తించి కౌన్సిలింగ్‌ ఇవ్వడం ద్వారా బలవన్మరణాలను అరికట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.