ఏడు నెలల గరిష్టాన్ని తాకిన స్టాక్ మార్కెట్లు

|

Oct 06, 2020 | 8:49 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. నిఫ్టి మార్కెట్లు ఏడు నెలల గరిష్టానికి తాకాయి. కరోనా ప్రభావంతో చతికిలాపడ్డా స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి.

ఏడు నెలల గరిష్టాన్ని తాకిన స్టాక్ మార్కెట్లు
Follow us on

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. నిఫ్టి మార్కెట్లు ఏడు నెలల గరిష్టానికి తాకాయి. కరోనా ప్రభావంతో చతికిలాపడ్డా స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఎనర్జీ మినహా మిగతా రంగాలు భారీ లాభాలను అర్జించాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.5 పాయింట్ల మేర నమోదు చేశాయి.సెన్సెక్స్ 600.87 పాయింట్లు లాభపడి 39,574.57 వద్ద ట్రేడ్ అయ్యింది. దాదాపు ఒక్కరోజులోనే 1.54% లాభాన్ని నమోదు చేసుకుంది. నిఫ్టీ 159 పాయింట్లు పెరిగి 11,662.40 వద్ద 1.38% శాతం లాభంతో ముగిసాయి. ఇక… 1,488 షేర్లు లాభాల్లో, 1,165 షేర్లు నష్టాల్లో ముగియగా, 159 షేర్లలో ఎలాంటి మార్పూలేదు. ఇండస్ ఇండ్ బ్యాంకు షేర్ ధర నాలుగు శాతానికి పైగా లాభపడింది. నిన్నటి వరకు ఎగసిపడిన ఐటీ స్టాక్స్ ఈ రోజు కాస్త వెనుకబడ్డాయి.

అటు నిఫ్టి స్టాక్ మార్కెట్లు ఉదయం మంచి లాభాల్లో ప్రారంభమయ్యాయి. ముగింపు వరకు అదే దూకుడు కొనసాగింది. ఆరంభ ట్రేడింగ్‌లోనే సెన్సెక్స్ 360 పాయింట్లు ఎగిసింది. నిఫ్టీ 92 పాయింట్లతో దూకుడుగా ప్రారంభించింది. ఓ దశలో సెన్సెక్స్ 39,623 పాయింట్లను తాకింది. చివరకు 600 పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్టీ ఏడు నెలల గరిష్టాన్ని తాకింది. ఇక, డాలర్ మారకంతో రూపాయి 17 పైసలు క్షీణించి 73.46 వద్ద ముగిసింది. ప్రారంభంలో డాలర్ మారకంతో రూపాయి 13 పైసలు బలపడి 73.16 వద్ద ట్రేడ్ అయ్యింది. నిన్నటి సెషన్‌లో 73.29 వద్ద ముగిసింది. చివరకు 17 పైసల నష్టాన్ని మూటగట్టుకుంది.