ఆంధ్రాలో ఓట్ల లెక్కింపుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరికొన్ని గంటల్లోనే కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుండటంతో.. అన్ని వర్గాల దృష్టి ఫలితాలపైనే ఉంది. ఎవరు గెలుస్తారో.. ఎవరు ఓడతారోనన్న ఆసక్తి గంట గంటకు పెరుగుతోంది. దీంతో ఫలితాల్ని ప్రశాంతంగా చూసేందుకు ఏపీలోని ప్రధాన పట్టణాలు, నగరాల్లోని స్టార్ హోటళ్లు, లాడ్జీలు హాస్ ఫుల్ అయిపోయయి. మరోవైపు గెలుపోటములపై బెట్టింగులు కూడా అంతే జోరుగా సాగుతోన్నాయి. దీంతో ఏపీలోని ప్రధాన నగరాల్లో సందడి వాతావరణం నెలకొంది. విజయవాడలో ప్రముఖ హోటళ్లు, రిసార్ట్స్, లాడ్జీలు హాస్‌ఫుల్ అయ్యాయి.