Thaman working for ten movies: ‘మళ్లీ మళ్లీ’ అనే సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులను తన సంగీతంతో పలకరించాడు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ థమన్. 2009లో వచ్చిన ఈ సినిమా పెద్దగా ఎవరికీ తెలియకపోయినా ఇండస్ట్రీకి మాత్రం ఒక సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ దొరికాడు. అనతికాలంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలన సంగీత దర్శకుడిగా పేరు సంపాదించుకున్న థమన్.. వరుసగా బడా హీరోల చిత్రాలకు సంగీతం అందించాడు.
ఇదిలా ఉంటే వచ్చే ఏడాది మొత్తం థమన్ హవా కొనసాగనుంది. ఇప్పటికే గడిచిన ఏడాదిలో ‘అల వైకుంఠ పురములో’, ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న థమన్ కొత్తేడాది కూడా ఫుల్ బిజీగా మారనున్నాడు. థమన్ ఏకంగా పది సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ప్రస్తుతం థమన్ చేతిలో.. క్రాక్, సర్కారు వారి పాట, అయ్యప్పునుమ్ కోషియమ్ రీమేక్, వకీల్ సాబ్, బాలయ్య – బోయపాటి సినిమా, వరుణ్ తేజ్ పదో చిత్రం, హీరో పునీత్ రామ్ కుమార్ హీరోగా నటిస్తోన్న ‘యువరత్న’, టక్ జగదీష్, శింబు హీరోగా తెరకెక్కనున్న ‘ఈశ్వరన్’, పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా ‘కేదువ’.. చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇలా 2021 దండయాత్ర సిద్ధమవుతోన్న థమన్ నెం1 మ్యూజిక్ డైరెక్టర్ రేసులో ఎక్కడ నిలుస్తాడో చూడాలి.
Also read: 2020 Round Up : ఈ ఏడాది పెళ్లిపీటలెక్కిన టాలీవుడ్ సెలబ్రిటీలు వీరే.. కరోనా కాలంలో ఒక్కటైన జంటలు