వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై కేసు నమోదు

విజయసాయిరెడ్డిపై శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం మండిపడ్డారు. అసత్య ఆరోపణలతో తన ట్రాన్స్‌ఫర్‌కి కారణమయ్యారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం టూటౌన్ పీఎస్‌లో కంప్లైంట్ చేశారు ఎస్పీ వెంకటరత్నం. 30 ఏళ్లుగా నిజాయితీతో బతుకుతున్న తన పరువు తీశారని అన్నారాయన. నిన్న కూడా ఈసీకి లేఖ రాసిన సందర్భంలో విజయసాయిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏ తప్పూ చేయని తనను అనవసరంగా బదిలీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా విజయసాయిరెడ్డిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు ఎస్పీ […]

వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై కేసు నమోదు

Edited By:

Updated on: Mar 28, 2019 | 10:56 AM

విజయసాయిరెడ్డిపై శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం మండిపడ్డారు. అసత్య ఆరోపణలతో తన ట్రాన్స్‌ఫర్‌కి కారణమయ్యారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం టూటౌన్ పీఎస్‌లో కంప్లైంట్ చేశారు ఎస్పీ వెంకటరత్నం. 30 ఏళ్లుగా నిజాయితీతో బతుకుతున్న తన పరువు తీశారని అన్నారాయన. నిన్న కూడా ఈసీకి లేఖ రాసిన సందర్భంలో విజయసాయిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏ తప్పూ చేయని తనను అనవసరంగా బదిలీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా విజయసాయిరెడ్డిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు ఎస్పీ వెంకటరత్నం.