ఇటీవల చాలా మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే గుండెకి మేలు చేసే సుగంధ ద్రవ్యాల గురించి చాలా మందికి తెలియదు. మనదేశంలో అన్ని వంటలలో దాదాపు ఈ సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తూ ఉంటాం. మరీ అవి చేసే మేలు గురించి తెలుసుకుందామా..
ముఖ్యంగా నాన్ వెజ్‌లో వాడే మసాలా దినుసులలో దాల్చిన చెక్క గురించి చెప్పనక్కర్లేదు.అయితే దీనిలో ఉండే యాంటీ యాక్సిండెంట్ల కారణంగా గుండె సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది. వీటితోపాటు ఏలకులు కూడా గుండెను కాపాడటంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. చాలా మంది ఏలకులను టీలో వాడుతారు. ఏలకులలో విటమిన్ ఏ, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, జింక్ వంటి పోషకాలు ఉన్నాయి. దీని ద్వారా శరీరంలో రక్తం గడ్డకుండా రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది. గుండెను సురక్షితంగా ఉంచడానికి ఇది తోడ్పడుతుంది. అంతేకాకుండా వెల్లుల్లిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తంలో కొవ్వు నిల్వలను తగ్గిస్తాయి. అంతేకాదు రక్తంలో చక్కెర నియంత్రణకు తోడ్పతుంది. ఆవాలను ఆహరంలో వాడడం వలన గుండె సమస్యలు తగ్గుతాయట. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తప్రసరణని మెరుగుపరచడంతోపాటు, రక్తంలో చక్కెర నిల్వలని తగ్గిస్తాయి. ఈ సుగంధ ద్రవ్యాలతో గుండె సమస్యలను తగ్గించుకోవచ్చు.