14 ‘బోయింగ్ 737 మ్యాక్స్ 8’ విమానాల్ని రద్దు చేసిన స్పైస్ జెట్

| Edited By:

Mar 13, 2019 | 4:26 PM

ఇండోనేషియా, ఇథియోపియాలో జరిగిన బోయింగ్ 737 విమాన ప్రమాదాలతో భారత వైమానిక రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ అప్రమత్తమైంది. బోయింగ్‌ 737 మ్యాక్స్‌ రకం విమానాలను నిలిపివేస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది. ఐదు నెలల వ్యవధిలో బోయింగ్ 737 రకం విమానాలు రెండు ప్రమాదానికి గురికావడంతో వీటి భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. భద్రతపరంగా తగిన మార్పులు చేసేంతవరకూ ఈ విమానాలు ఎగరడానికి అనుమతించేదిలేదని డీజీసీఏ స్పష్టం చేసింది. ప్రస్తుతం స్పైస్ జెట్ 14 విమానాల రద్దును ప్రకటించింది. రేపటి […]

14 బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానాల్ని రద్దు చేసిన స్పైస్ జెట్
Follow us on

ఇండోనేషియా, ఇథియోపియాలో జరిగిన బోయింగ్ 737 విమాన ప్రమాదాలతో భారత వైమానిక రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ అప్రమత్తమైంది. బోయింగ్‌ 737 మ్యాక్స్‌ రకం విమానాలను నిలిపివేస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది. ఐదు నెలల వ్యవధిలో బోయింగ్ 737 రకం విమానాలు రెండు ప్రమాదానికి గురికావడంతో వీటి భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. భద్రతపరంగా తగిన మార్పులు చేసేంతవరకూ ఈ విమానాలు ఎగరడానికి అనుమతించేదిలేదని డీజీసీఏ స్పష్టం చేసింది. ప్రస్తుతం స్పైస్ జెట్ 14 విమానాల రద్దును ప్రకటించింది. రేపటి నుంచి అదనంగా విమానాలు నడుపుతామని తెలిపింది.