తెలుగువారి కోసం స్పెషల్ ఫ్లైట్..!

| Edited By: Pardhasaradhi Peri

Jun 04, 2020 | 6:56 PM

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో అమెరికాలో చిక్కుకున్న తెలుగు ప్రజలను రప్పించేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది యూఎస్‌- ఇండియా సాలిడారిటీ మిషన్‌. ఈ ప్రత్యేక విమానం జూన్‌ 9 నెవార్క్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరనుంది.

తెలుగువారి కోసం స్పెషల్ ఫ్లైట్..!
Follow us on

కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి వారిని అక్కడ కట్టడి చేసింది. లాక్ డౌన్ కారణంగా రెండు రాష్ట్రాలకు చెందిన తెలుగువారు అమెరికాలో చిక్కుపోయారు. కేంద్ర సర్కార్ అనుమతితో వారిని స్వదేశానికి రప్పించేందుకు యూఎస్‌- ఇండియా సాలిడారిటీ మిషన్‌ ముందుకొచ్చింది.
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో అమెరికాలో చిక్కుకున్న తెలుగు ప్రజలను రప్పించేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది యూఎస్‌- ఇండియా సాలిడారిటీ మిషన్‌. ఈ ప్రత్యేక విమానం జూన్‌ 9 నెవార్క్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరనుంది. ప్రవాంసాంధ్రుల తరపున రవి పులి భారత ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ మేరకు అనుమతినిచ్చింది. యూఎస్‌- ఇండియా సాలిడారిటీ మిషన్‌ కింద ప్రైవేట్‌ ఛార్టర్‌ విమానానం అమెరికా నుంచి హైదరాబాద్ కి చేరుకోనుంది. లాక్‌ డౌన్‌ కారణంగా అమెరికాలో చిక్కుకున్న తెలుగు వారితో పాటు, ఓసీఐ కార్డు హోల్డర్లు ప్రయాణం చేసేందుకు వీలు కల్పించింది భారత ప్రభుత్వం. అయితే విమానం ద్వారా భారత చేరుకున్న ప్రతి ప్రయాణీకులు ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత ప్రభుత్వం నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక విమానంలో రావాలనుకున్ననే భారతీయులు అవకాశాన్ని వినియోగించుకోవాలని యూఎస్‌- ఇండియా సాలిడారిటీ మిషన్‌ వెల్లడించింది. తెలుగు వారి కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక వెబ్ సైట్ ను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇవ్వబడిన లింక్ http://www.usism.org/register-private-charter-flight.html ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు.