నలుగురు వ్యోమగాములతో స్పేస్ ఎక్స్ రాకెట్ లాంచ్, సీట్లలో ఎస్ట్రోనట్స్, ఫస్ట్ టైమ్ ఇమేజెస్ రిలీజ్

| Edited By: Anil kumar poka

Nov 16, 2020 | 11:38 AM

యుఎస్ లో స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ లాంచ్ అయింది. నలుగురు వ్యోమగాములతో కూడిన ఈ  రాకెట్ 27 గంటల అనంతరం అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనాకేంద్రానికి చేరుకోనుంది.

నలుగురు వ్యోమగాములతో స్పేస్ ఎక్స్  రాకెట్ లాంచ్, సీట్లలో ఎస్ట్రోనట్స్, ఫస్ట్ టైమ్  ఇమేజెస్ రిలీజ్
Follow us on

యుఎస్ లో స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ లాంచ్ అయింది. నలుగురు వ్యోమగాములతో కూడిన ఈ  రాకెట్ 27 గంటల అనంతరం అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనాకేంద్రానికి చేరుకోనుంది. ఇప్పటికే ఆ కేంద్రంలో ఇద్దరు రష్యన్, ఓ అమెరికన్ వ్యోమగామి ఉన్నారు. తాజాగా వెళ్తున్న నలుగురు యేస్ట్రోనట్లూ ఆరు నెలలపాటు అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో పరిశోధనలు చేయనున్నారు. మొదట కేబిన్ ఉష్ణోగ్రతలో సమస్య తలెత్తిందని, ఆ ఆ తరువాత దీన్ని పరిష్కరించగలిగామని స్పేస్ ఎక్స్ వర్గాలు వెల్లడించాయి.

ఈ రాకెట్ లో వ్యోమగాములు కూర్చున్న ఇమేజీలను విడుదల చేయడం విశేషం. గతంలో ఎన్నడూ రష్యన్లు గానీ, అమెరికన్లు గానీ ఇలా ఇమేజిలను రిలీజ్ చేయలేదు. ఈ లాంచ్ పట్ల అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన జో బైడెన్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయగా, డొనాల్డ్ ట్రంప్..’గ్రేట్’ అని ముక్తసరిగా వ్యాఖ్యానించారు. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తన భార్యతో సహా ఈ లాంచ్ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. అమెరికా అంతరిక్ష అన్వేషణలో  ఇదో కొత్త శకం అని ఆయన అభివర్ణించారు. కాగా వచ్చే ఏడాది స్పేస్ ఎక్స్ వ్యోమగాములతో కూడిన మరో రెండు మిషన్లను చేపట్టనుంది.