AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సరదాగా కాసేపు క్రికెట్ ఆడిన మంత్రి హరీష్‌రావు..ఒక ఓవర్ బౌలింగ్, ఒక ఓవర్ బ్యాటింగ్

హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వంలో కీలక మంత్రి. ఎప్పుడూ రాజకీయాలలో బిజీగా ఉంటారు. తన మాటల తూటాలతో ప్రత్యర్థులను భయపెడతారు.

సరదాగా కాసేపు క్రికెట్ ఆడిన మంత్రి హరీష్‌రావు..ఒక ఓవర్ బౌలింగ్, ఒక ఓవర్ బ్యాటింగ్
Ram Naramaneni
|

Updated on: Nov 16, 2020 | 11:48 AM

Share

హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వంలో కీలక మంత్రి. ఎప్పుడూ రాజకీయాలలో బిజీగా ఉంటారు. తన మాటల తూటాలతో ప్రత్యర్థులను భయపెడతారు. నియోజకవర్గంలో కలియ తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. ఒక వైపు మంత్రి బాధ్యతలు, మరోవైపు పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉండే ఆయనకు కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువ సమయం గడిపే అవకాశం లభించదు. అయితే కాసేపు వీట్నింటిని పక్కన బెట్టి మంత్రి గారు..క్రికెట్ గ్రౌండ్‌లో సేదతీరారు.

సరదాగా బ్యాట్ పట్టి మెరుపులు మెరిపించారు. అనుభవం ఉన్న బౌలర్‌లా చేయి తిప్పి బౌలింగ్ కూడా వేశారు. తాను ఆల్‌రౌండర్‌నంటూ అక్కడి క్రీడాకారులతో కాసేపు ముచ్చటించారు. సిద్దిపేట మైదానంలో మెదక్ ఎస్పీ పోలీస్ వర్సెస్ సిద్ధిపేట పోలీసు కమిషనరేట్ మధ్య ఇరవై ఓవర్ల క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్‌ను ముఖ్య అతిథిగా హాజరైన మినిస్టర్ హరీష్‌రావు ప్రారంభించారు. టాస్ వేసిన అనంతరం ఒక ఓవర్ బ్యాటింగ్ చేసిన ఆయన, మరో ఓవర్ బౌలింగ్ చేశారు. సిద్ధిపేట పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ బౌలింగ్ చేయగా మంత్రి హరీశ్ రావు బ్యాటింగ్ చేశారు. ఈ కార్యక్రమం జరిగినంతసేపు కోవిడ్ నిబంధనలు పాటించిన మంత్రి..మాస్క్ ధరించారు.

Also Read : 

ఎన్టీఆర్​-త్రివిక్రమ్​ సినిమాకు ముహూర్తం ఫిక్స్ ! హీరోయిన్‌గా ఆమెను ప్రిఫర్ చేస్తున్నారట

ఒక్క రూపాయికే క్వార్టర్ మద్యం..అభిమాన దర్శకుడి పెళ్లి రోజు సందర్భంగా

‘డాక్టర్‌ బాబు’ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌!

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్