దక్షిణ కొరియాలో ఆ దేశాలకు అనుమతి రద్దు..!

|

Jun 22, 2020 | 2:12 PM

దక్షిణ కొరియాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా పాకిస్తాన్, బంగ్లాదేశీయుల రాకలపై అంక్షలు విధించింది. ఈ రెండు దేశాల నుంచి వచ్చే వారిని తమ దేశంలోకి అనుమతించవద్దని నిర్ణయం తీసుకుంది.

దక్షిణ కొరియాలో ఆ దేశాలకు అనుమతి రద్దు..!
Follow us on

కరోనా వైరస్ కట్టడికి అయా దేశాలు పక్కా ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. దక్షిణ కొరియాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా పాకిస్తాన్, బంగ్లాదేశీయుల రాకలపై అంక్షలు విధించింది. ఈ రెండు దేశాల నుంచి వచ్చే వారిని తమ దేశంలోకి అనుమతించవద్దని నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్, బంగ్లాదేశీయులకు వీసాలు ఇవ్వకూడదని, ఆ దేశాల విమాన సర్వీసులకు కూడా అనుమతించవద్దని దక్షిణ కొరియా నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పదని సౌత్ అధికారులు ఓ ప్రకటనలో పేర్కోన్నారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకూ ఈ అంక్షలు అమలులో ఉంటాయని తెలిపింది.