ఎవరినైనా మిస్ చేస్తే క్షమించండిః సోనూసూద్

|

May 29, 2020 | 11:56 AM

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కుంటున్న సమయంలో చాలామంది ప్రముఖులు తమ వంతుగా ముందుకొచ్చి సాయం చేశారు. వారి కోవలోనే బాలీవుడ్ నటుడు సోనూసూద్ వలస కూలీలకు అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుకున్నాడు. ఆయన సిల్వర్ స్క్రీన్ పైన విలన్ అయినా.. రియల్ లైఫ్‌లో గ్రేట్ హీరో అనిపించుకున్నారు. వలస కార్మికులను నేనున్నానంటూ అండగా నిలిచి.. ప్రభుత్వాల నుంచి అనుమతులు తీసుకుని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వారిని స్వస్థలాలకు చేరుస్తున్నారు. ఆయన […]

ఎవరినైనా మిస్ చేస్తే క్షమించండిః సోనూసూద్
Follow us on

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కుంటున్న సమయంలో చాలామంది ప్రముఖులు తమ వంతుగా ముందుకొచ్చి సాయం చేశారు. వారి కోవలోనే బాలీవుడ్ నటుడు సోనూసూద్ వలస కూలీలకు అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుకున్నాడు. ఆయన సిల్వర్ స్క్రీన్ పైన విలన్ అయినా.. రియల్ లైఫ్‌లో గ్రేట్ హీరో అనిపించుకున్నారు. వలస కార్మికులను నేనున్నానంటూ అండగా నిలిచి.. ప్రభుత్వాల నుంచి అనుమతులు తీసుకుని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వారిని స్వస్థలాలకు చేరుస్తున్నారు. ఆయన చేసే ఈ గొప్ప పనికి సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొంతమంది అయితే సోనూను సరదాగా ఆటపాటిస్తున్నారు కూడా.

ఇదిలా ఉంటే ఇప్పటికే చాలామంది వలస కూలీలను వారి సొంతూళ్లకు పంపిన సోనూసూద్‌కు ఇంకా ఎందరో సహాయం చేయాలంటూ సంప్రదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘మీ సందేశాలు ఎంతో వేగంగా మాకు చేరుతున్నాయి. ప్రతి ఒక్కరికీ సహాయం చేసేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ కొందరి అభ్యర్థనలను మేం మిస్ చేసి ఉంటే క్షమించండి’ అంటూ సోనూసూద్ తెలిపారు. మరోవైపు సాయం కోసం ఎదురు చూస్తున్న వారికి సోనూసూద్ ఓ టోల్ ఫ్రీ నెంబర్‌ను లాంచ్ చేశారు.

Read This: తెలంగాణలో జూలై 5 తర్వాతే పాఠశాలలు ప్రారంభం..?