#covidindia కొబ్బరితోటలో సాఫ్ట్‌వేర్ జాబ్

|

Mar 17, 2020 | 5:08 PM

కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా జనం భయాందోళన చెందుతోంది. దేశాలకు దేశాలకు ఆరోగ్య ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నాయి. సోషల్ గ్యాదరింగ్‌కు దూరంగా వుండడం ఒక్కడే కరోనా వ్యాప్తిని నియంత్రించగలదన్న ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఓ ఐటీ కంపెనీ వినూత్నమైన ఆలోచన చేసింది.

#covidindia కొబ్బరితోటలో సాఫ్ట్‌వేర్ జాబ్
Follow us on

IT firm offering software job in coconut farm: కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా జనం భయాందోళన చెందుతోంది. దేశాలకు దేశాలకు ఆరోగ్య ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నాయి. సోషల్ గ్యాదరింగ్‌కు దూరంగా వుండడం ఒక్కడే కరోనా వ్యాప్తిని నియంత్రించగలదన్న ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఓ ఐటీ కంపెనీ వినూత్నమైన ఆలోచన చేసింది.

కరోనా వైరస్‌ కారణంగా కొన్ని కంపెనీలు.. ముఖ్యంగా ఐటీ కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పాలసీని తీసుకొచ్చాయి.. హాయిగా ఇంటినుంచే పని చేయండి అని చెబుతున్నాయి.. ఇదిలాఉంటే బెంగళూరుకు చెందిన ఓ ఐటీ కంపెనీ మాత్రం తమ ఉద్యోగులను తమిళనాడుకు తరలించింది. వర్తమానపురంలో ఉన్న కొబ్బరి తోటల్లో వర్క్‌ చేసేలా అన్ని ఏర్పాట్లు చేసింది. దీంతో ఉద్యోగులు కొబ్బరితోటల్లో చల్లగా పని చేసుకుంటున్నారు. ఏసీ రూములకు అలవాటు పడిన తమకు కొబ్బరి తోటల్లో పని చేయడం కొంచెం కష్టంగా ఉన్నా మంచి అనుభూతిని ఇస్తున్నదని ఐటీ ఉద్యోగులు చెబుతున్నారు.

దానికి తోడు కేంద్ర ప్రభుత్వం నుంచి పలు ప్రైవేటు సంస్థలకు నిర్దిష్టమైన ఆదేశాలు అందాయి. తమ ఉద్యోగుల్లో 50 శాతం మేరకు వర్క్ ఫ్రమ్ కిందకు తరలించాలని, దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని నిర్దేశించింది కేంద్రప్రభుత్వం. వీలు కాని పరిస్థితిలో అవసరమైతే పెయిడ్ లీవుల్లో కొందరినైనా పంపించాలని కేంద్ర మార్గదర్శకాలను జారీ చేసింది.