లక్నవరం చెరువులో పడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గల్లంతు.. యువకుడి కోసం కొనసాగుతున్న గాలింపుచర్యలు

|

Dec 25, 2020 | 9:49 PM

ములుగు జిల్లా విహారయాత్ర ప్రాణాల మీదకు తెచ్చింది. వరుస సెలవులు రావడంతో సరదా గడిపేందుకు వెళ్లిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చెరువులో గల్లంతయ్యాడు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

లక్నవరం చెరువులో పడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గల్లంతు.. యువకుడి కోసం కొనసాగుతున్న గాలింపుచర్యలు
Follow us on

ములుగు జిల్లా విహారయాత్ర ప్రాణాల మీదకు తెచ్చింది. వరుస సెలవులు రావడంతో సరదా గడిపేందుకు వెళ్లిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చెరువులో గల్లంతయ్యాడు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు లక్నవరం జలాశయంలో జారిపడి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సుధాకర్‌ (22) గల్లంతయ్యాడు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన సుధాకర్‌ హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో స్నేహితులతో సరదా గడిపేందుకు శుక్రవారం ఉదయం లక్నవరం చేరుకున్నారు. సాయంత్రం చెరువుకట్టపై మెట్ల ప్రాంతంలో ఉండగా ప్రమాదవశాత్తు కాలుజారి జలాశయంలో పడిపోయాడు. స్నేహితులు గమనించేలోపే సుధాకర్ నీటిలో మునిగిపోయాడు. దీంతో షాక్‌కు గురైన మిత్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు గజఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.