హాట్ టాపిక్‌గా మళ్లీ తెరపైకి స్మగ్లర్ వీరప్పన్ పేరు

| Edited By:

Feb 23, 2020 | 8:58 PM

తమిళనాడులో మరోసారి స్మగ్లిర్ల్ వీరప్పన్ పేరు హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా వీరప్పన్ కుమార్తె విద్యా రాణి బీజేపీలో చేరిన సందర్భంగా మళ్లీ ఈ అంశం చర్చకు దారితీసింది..

హాట్ టాపిక్‌గా మళ్లీ తెరపైకి స్మగ్లర్ వీరప్పన్ పేరు
Follow us on

తమిళనాడులో మరోసారి స్మగ్లిర్ల్ వీరప్పన్ పేరు హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా వీరప్పన్ కుమార్తె విద్యా రాణి బీజేపీలో చేరిన సందర్భంగా మళ్లీ ఈ అంశం చర్చకు దారితీసింది. కృష్ణ గిరిలో జరిగిన బీజేపీ పార్టీ కార్యక్రమంలో పార్టీ సెక్రటెరీ మురళీధర్ రావు, కేంద్ర మాజీ మంత్రి పొన్నురాధాక్రిష్ణా సమక్షంలో శనివారం వీరప్పన్ కుమార్తె విద్యారాణి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ పథకాలు, పరిపాలనా నచ్చడంతోనే బీజేపీలో చేరినట్టు పేర్కొన్నారు. కాగా ఆమెతో పాటు దాదాపు వెయ్యిమంది అనుచరులు బీజేపీలో చేరినట్టు విద్యారాణి స్పష్టం చేశారు. కాగా గతంలో వీరప్పన్‌పై ప్రజల్లో ఉన్న సానుకూలతతో 2006లో రాజకీయాల్లోకి వచ్చారు వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి. తమిళనాడు అసెంబ్లీకి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇప్పుడు తాజాగా కుమార్తె రాజకీయాల్లోకి రావడం మరోసారి చర్చకు దారితీసింది. అందులోనూ బీజేపీలో పార్టీలో చేరడం తమిళనాడు వ్యాప్తంగా ఈ వార్త సంచలనంగా మారింది.

Read More: ట్రంప్ భారత్ పర్యటన షెడ్యూల్ ఫిక్స్.. వివరాలు ఇవే!