హీరో అంటే ఆ ఎలుగుబంటే మరి ! తానేమాత్రం భయపడకుండా రెండు పులులను ధైర్యంగా ఎదిరించేసరికి అవి రెండూ తోక ముడిచి పారిపోయాయి. రాజస్థాన్ లోని రథం బోర్ నేషనల్ పార్క్ లో జరిగిందీ అనూహ్య ఘటన. ఓ పొదల్లో ఏమరుపాటుగా ఉన్న ఈ ఎలుగుబంటి వద్దకు ఓ పులి మెల్లగా రాగా.. వెంటనే అలెర్ట్ అయిన ఆ ఎలుగు ముందున్న రెండు కాళ్లూ ఎత్తి ‘ ఫైట్ ‘ కు సై అన్నట్టు నిలబడగానే పులి భయపడిపోయి వెనక్కి తగ్గింది. దారిలోనే ఉన్న మరో పులిని కూడా ముందుకు వఛ్చి మరీ ఆ ఎలుగు భయపెట్టింది. అదీ తానున్న చోటి నుంచి కదిలితే ఒట్టు.. రాజ్యసభ ఎంపీ పరిమళ్ నత్వాని ఈ హీరో ఎలుగు తాలూకు వీడియోను షేర్ చేశారు. దీనికి వేలాది లైక్స్ , వందలాది ట్వీట్స్ వచ్చాయని వేరే చెప్పాలా ?
This video captures an unexpected #clash between #Tiger & Sloth Bear in #Rajasthan’s @ranthamborepark. Just as the Tiger seems to dominate the unaware Sloth Bear, it springs at the Tiger and scares it off! #Wildlife is full of such wonders & surprises.@ParveenKaswan @WWFINDIA pic.twitter.com/bbyfP6uFuZ
— Parimal Nathwani (@mpparimal) January 21, 2020