MLA Vidadala Rajini : ఎమ్మెల్యే విడదల రజనీ మరిదిపై దాడి కేసులో ఆరుగురి అరెస్టు

ఇటీవల శివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా కోటప్పకొండ ప్రభల యాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ కారుపై దాడి చేసిన కొందరు వ్యక్తులు..అందులో ఉన్న ఎమ్మెల్యే మరిది గోపిని గాయపరిచారు.

MLA Vidadala Rajini : ఎమ్మెల్యే విడదల రజనీ మరిదిపై దాడి కేసులో ఆరుగురి అరెస్టు

Updated on: Feb 25, 2020 | 8:54 PM

MLA Vidadala Rajini :ఇటీవల శివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా కోటప్పకొండ ప్రభల యాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ కారుపై దాడి చేసిన కొందరు వ్యక్తులు..అందులో ఉన్న ఎమ్మెల్యే మరిది గోపిని గాయపరిచారు. ఈ విషయంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఘటనకు సంబంధించి విచారణ వేగవంతం చేయాలని పోలీసులకు ఆదేశాలు అందాయి. ఈ క్రమంలో దాడితో సంబంధం ఉన్న ఆరుగురిని పోలీసులు  అరెస్టు చేశారు. ఈ ఘటనలో మొత్తం 24 మందిపై కేసు నమోదవ్వగా… మిగిలిన 18 మందిని విచారిస్తున్నారు.