అరుణాచల్ ప్రదేశ్‌లో నితీశ్‌కుమార్‌కు భారీ షాక్.. బీజేపీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రవులు ఉండరని మరోసారి రుజువైంది. ఓ రాష్ట్రంలో మిత్రులుగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు మరో రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఆ పార్టీలోనే చేరిపోయారు. బీహార్ ముఖ్యమంత్రి జనతాదళ్‌ యునైటెడ్‌పార్టీ అధినేత నితీశ్ కుమార్‌కు గట్టి షాక్ తగిలింది. మిత్రపక్షంగా ఉన్న పార్టీనే జేడీయూ పార్టీ నేతలను కలిపేసుకుంది.

అరుణాచల్ ప్రదేశ్‌లో నితీశ్‌కుమార్‌కు భారీ షాక్.. బీజేపీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు
Follow us

|

Updated on: Dec 25, 2020 | 9:16 PM

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రవులు ఉండరని మరోసారి రుజువైంది. ఓ రాష్ట్రంలో మిత్రులుగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు మరో రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఆ పార్టీలోనే చేరిపోయారు. బీహార్ ముఖ్యమంత్రి జనతాదళ్‌ యునైటెడ్‌పార్టీ అధినేత నితీశ్ కుమార్‌కు గట్టి షాక్ తగిలింది. మిత్రపక్షంగా ఉన్న పార్టీనే జేడీయూ పార్టీ నేతలను కలిపేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలు కషాయం కండువా కప్పుకున్నారు. ఈ చేరికతో 60 అసెంబ్లీ స్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్‌లో ఇప్పుడు బీజేపీ బలం 48కి చేరింది. ఇంతకాలం ప్రధాన ప్రతిపక్షపార్టీగా ఉన్న జేడీయూ ఒక్కస్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది.

ఇదిలావుండగా, గతేడాది జరిగిన అరుణాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాల్లో జేడీయూ అభ్యర్థలు గెలుపొందారు. కానీ, జేడీయూ ఎమ్మెల్యేలు ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నెల క్రితం ఆ ఆరుగురు ఎమ్మెల్యేలకు జేడీయూ నోటీసులు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ నాయకత్వంపై ఉన్న విశ్వాసం కారణంగానే వారు తమ పార్టీలోకి చేరారని అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర చీఫ్ బయూరాం వ్యాఖ్యానించారు. కాగా, ఎమ్మెల్యే తీరుపట్ల జేడీయూ నేతలు మండిపడుతున్నారు. తాజా పరిణామాలపై జేడీయూ నేత కేసీ త్యాగి స్పందించారు. ఈ సంఘటనలతో సంబంధం లేకుండా తాము ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. స్నేహపూర్వక ప్రతిపక్షంగా కొనసాగుతామని చెప్పుకొచ్చారు.

ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు