SIT on insider trading: ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సిట్ యాక్షన్ షురూ

|

Feb 29, 2020 | 2:26 PM

అమరావతి రాజధాని ఏరియాలో జరిగిందని భావిస్తున్న ఇన్‌సైడర్ ల్యాండ్ ట్రేడింగ్‌పై సిట్ అధికారులు దాడులు ప్రారంభించారు. కంచికచర్ల మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ లక్ష్మీనారాయణ...

SIT on insider trading: ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సిట్ యాక్షన్ షురూ
Follow us on

Special Investigation Team started raids on insider trading allegations: అమరావతి రాజధాని ఏరియాలో జరిగిందని భావిస్తున్న ఇన్‌సైడర్ ల్యాండ్ ట్రేడింగ్‌పై సిట్ అధికారులు దాడులు ప్రారంభించారు. కంచికచర్ల మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ లక్ష్మీనారాయణ ఇంటికి శనివారం ఉదయం చేరుకున్న సిట్ అధికారులు.. దాడులకు శ్రీకారం చుట్టారు. లక్ష్మీనారాయణ సమక్షంలో ఇంటిలో తనిఖీలు చేస్తున్నారు.

శుక్రవారం సాయంత్రం సిట్ అధికారులు లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్ళినా.. ఇంట్లో ఎవరు లేకపోవడంతో కేవలం నోటీసు అంటించి తిరిగి వెళ్ళిపోయారు. తిరిగి శనివారం ఉదయం ఆయన ఇంటికి వచ్చిన సిట్ బృందం తనిఖీలను ప్రారంభించింది. సిట్ అధికారుల తనిఖీల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన నన్నపనేని లక్ష్మీనారాయణ.. తాను ఎక్కడికీ పారిపోలేదని వివరణ ఇచ్చారు. అనారోగ్యం కారణంగా హాస్పిటల్‌కి వెళ్లి వచ్చానని, సిట్ అధికారులకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు.

ఇదిలా వుండగా.. శుక్రవారం విజయవాడలో నివాసం ఉంటున్న లక్ష్మీ నారాయణ కుమారుడు సీతారామరాజు ఇంట్లో సోదాలు సిట్ అధికారులు నిర్వహించారు. తన కుమారుడి ఇంట్లో సోదాల జరిగిన వెంటనే లక్ష్మీనారాయణ పారిపోయారంటూ కథనాలు మొదలయ్యాయి. శనివారం మాత్రం లక్ష్మీనారాయణ సిట్ బృందం వచ్చిందని తెలుసుకున్న వెంటనే ఇంటికి వచ్చేశారు. లక్ష్మీనారాయణ సమక్షంలోనే సిట్ బృందం తనిఖీలను కొనసాగించింది.