టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. నాలుగో రోజు రెండో సెషన్‌లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్‌ను ఉద్దేశించి ప్రేక్షకులు ఏవో వ్యాఖ్యలు చేశారు. సిరాజ్ ఈ విషయాన్ని కెప్టెన్ రహానెకు తెలియజేశాడు. దీంతో కాసేపు ఆటకు అంతరాయం ఏర్పడింది. వెంటనే స్పందించిన మైదానం సిబ్బంది, పోలీసులు అక్కడున్న ఆరుగురు యువకులను బయటకు పంపించారు. ఈ విషయం పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా టీమిండియాకు క్షమాపణలు చెప్పింది. కాగా జనవరి 9న సైతం భారత పేసర్లు బుమ్రా, సిరాజ్‌పై ఓ ఆస్ట్రేలియా ప్రేక్షకుడు జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.