ఇటలీ నేపుల్స్‌లోని ఓ ఆసుపత్రి ఎదుట వింత సంఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రి ముందు పార్కింగ్ చేసిన కార్లన్ని ఒక్కసారిగా భూమి లోపలికి వెళ్ళిపోయాయి. దీంతో ఆ ఘటన చూసిన అక్కడున్నవారు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనతో ఆసుపత్రిలో కరెంట్ పోయింది. ఆసుపత్రి సిబ్బంది వెంటనే పేషంట్లను బయటకు పంపించివేశారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ‘ఓస్పడేల్ డెల్ మేరే కార్ పార్కింగ్ ప్రాంతంలో సింగ్ హోల్ ఏర్పడింది. అందుకే అక్కడ పార్క్ చేసిన కార్లు లోపలికి పడిపోయాయి. “హైడ్రో-జియోలాజికల్ సమస్య” వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది’ అని ఇటలీ అగ్నిమాపక శాఖ ట్విట్టర్‌లో తెలిపింది. నేపుల్స్ ఆస్పత్రి ఉన్న కాంపానియా ప్రాంత అధిపతి విన్సెంజో డి లూకా మాట్లాడుతూ.. “అదృష్టవశాత్తూ ఈ ఘటన సిస్టమ్స్ ఇంజనీరింగ్ పరంగా.. ముఖ్యంగా మానవ జీవితాల పరంగా ఎలాంటి నష్టం కలిగించలేదు” అని తెలిపారు. ఈ ఆసుపత్రి కరోనా పేషెంట్ల చికిత్సకు ఉపయోగిస్తుండగా.. ఈ ఘటనతో కొవిడ్ వార్డును తాత్కలికంగా మూసివేశారు.
Also Read: వికారాబాద్ జిల్లాలో దారుణం.. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. బాత్రూంలోనే నిండు గర్బిణి ప్రసవం..
చంద్రుడిపై కారు రేసులు.. జాబిల్లి పైకి కార్లు పంపనున్న అమెరికా