హెల్త్ కేర్ లో ప్లాస్టిక్ నిషేధం ఎంతవరకు సబబు ?

పర్యావరణ పరిరక్షణ, రోగి సేఫ్టీ.. ఈ రెండూ ఎంతో ముఖ్యమే.. ఈ విషయంలో ఈ దేశం సరైన దిశలోనే పయనిస్తోంది. ఇందుకు మనకు మనం రుణపడి ఉండడమే కాదు.. భవిష్యత్ తరాలకు కూడా రుణపడిఉండాలి.. పర్యావరణ పరిరక్షణ కోసం మన ప్రభుత్వం మంచి ప్రచారోద్యమాన్నే చేబట్టింది. ఇందులో భాగంగా హెల్త్ కేర్ లో వినియోగించే అనేక వస్తువులను చేర్చింది. వీటిని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ స్క్రూటినీ చేస్తోంది. ఇది మంచి పధ్ధతే. ఈ చొరవకు […]

హెల్త్ కేర్ లో ప్లాస్టిక్ నిషేధం ఎంతవరకు సబబు ?

Edited By:

Updated on: Nov 12, 2019 | 12:32 PM

పర్యావరణ పరిరక్షణ, రోగి సేఫ్టీ.. ఈ రెండూ ఎంతో ముఖ్యమే.. ఈ విషయంలో ఈ దేశం సరైన దిశలోనే పయనిస్తోంది. ఇందుకు మనకు మనం రుణపడి ఉండడమే కాదు.. భవిష్యత్ తరాలకు కూడా రుణపడిఉండాలి.. పర్యావరణ పరిరక్షణ కోసం మన ప్రభుత్వం మంచి ప్రచారోద్యమాన్నే చేబట్టింది. ఇందులో భాగంగా హెల్త్ కేర్ లో వినియోగించే అనేక వస్తువులను చేర్చింది. వీటిని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ స్క్రూటినీ చేస్తోంది. ఇది మంచి పధ్ధతే. ఈ చొరవకు పతి పౌరుడి మద్దతూ అవసరమవుతుంది. అలాగే సమాజం కూడా ఇందులో తన వంతు పాత్ర పోషించాల్సిందే. చట్టాలు, అవగాహన, ప్రచారాలు ఇలాంటివాటికి వాటి.. వాటి విశిష్ఠత ఉండవచ్చు. అయితే వీటి సక్సెస్ అన్నది అందరి పూర్తి భాగస్వామ్యంపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం హెల్త్ కేర్ మీద ఫోకస్ పెట్టిన పక్షంలో అది ప్రధానంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పైనే అవుతోంది. మనకు ఇష్టం ఉన్నా..లేకపోయినా హెల్త్ కేర్ డెలివరీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపైనే ఆధారపడి ఉంది.

నా తొలి రోజుల్లో రోగులకు ఇంజెక్షన్లు ఇచ్చేందుకు మేం గ్లాస్ సిరంజీలను, మెటల్ నీడిల్స్ నీ వాడేవారం. వాటిని స్టెరిలైజ్ చేసి.. తిరిగి వినియోగించేవారం. కానీ అవి ఇప్పుడు పాతబడిపోయాయి. అయితే ఇందుకు ఓ కారణం ఉంది. వీటిని మళ్ళీ మళ్ళీ వాడడం వల్ల హెచ్ఐవీ, హెపటైటిస్ వంటి వ్యాధుల వ్యాప్తికి కారణమవుతూ వచ్చాయి. ఎన్నో అధ్యయనాలు దీన్ని నిరూపించాయి కూడా. సింగిల్ యూజ్ సిరంజీలను, ప్లాస్టిక్ నీడిల్స్ నీ నిషేధిస్తే పరిస్థితిని ఒక్కసారి ఊహించండి.. మనం మళ్ళీ వాటిని వాడగలుగుతామా ? ఊహించడానికే భయం వేస్తుంది. అసలు ఊహించలేం కూడా ! అలాగే ఆరోగ్య పరిరక్షణలో వాడే అత్యవసర వస్తువుల విషయంలో ఏదీ ఊహించలేం.. ప్లాస్టికేతర ప్రత్యామ్నాయాల వినియోగం గురించి కూడా చెప్పుకోవలసిందే. చేతి గ్లోవ్స్ విషయానికే వస్తే.. ఇవి ప్లాస్టిక్ తో తయారైనవే.. రోగుల, డాక్టర్ల పరిరక్షణకు ఉద్దేశించిన ఇవి ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడతాయి. మరి.. గ్లోవ్స్ కి ప్రత్యామ్నాయమేమిటి ? సింపుల్ సిరంజీలు, గ్లోవ్స్, ఇంట్రావీనస్ ట్యూబ్స్ నుంచి, కాంప్లెక్స్ కేథటీర్స్, ఇంప్లాంట్స్, స్టెంట్స్, ఇలాంటివన్నీ హెల్త్ కేర్ లో సురక్షిత ప్రత్యామ్నాయాలు లేని ప్లాస్టిక్ లాంటివే.. అంటే హెల్త్ కేర్ లో ప్లాస్టిక్ ని బ్యాన్ చేయడమన్నది ఆచరణ యోగ్యం కాదు.

కానీ బాధ్యతాయుతంగా ప్లాస్టిక్ ని వినియోగించడం సాధ్యమే.. మెడికల్ వేస్ట్ ని వేరు చేసి దాన్ని డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రధానంగా ప్రభుత్వ సంస్థల బాధ్యత.. మెడికల్ వేస్ట్ వల్ల పర్యావరణంపై పడే తీవ్ర ప్రభావాన్ని ఇలాంటి చర్యలు చాలావరకు తగ్గించగలుగుతాయి. ప్లాస్టిక్ ని నిషేధించడమే ప్రధాన లక్ష్యమైతే.. ఇందుకు చక్కని ప్రత్యామ్నాయాలను కూడా కనుగొనాల్సి ఉంది. దీనిపై ఎంతో పరిశోధన అవసరం. ప్రత్యామ్నాయాలు లభించనంతవరకు హెల్త్ కేర్ ప్రొవైడర్లు బాధ్యతాయుతంగా ప్లాస్టిక్ ని వినియోగించాల్సి ఉంటుంది. అదే సమయంలో వైద్య సంబంధ వ్యర్థాలను ప్రభుత్వ సంస్థలు వేరు చేసి.. డిస్పోజ్ చేయడం కూడా అంతే అవసరం. హెల్త్ కేర్ లో ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించి మేం (డాక్టర్లం) కొంత ‘ దూరంలో ‘ ఉన్నట్టే పరిగణించాలి.

Disclaimer:ఈ ఆర్టికల్ లోని అంశాలు రచయిత సొంత అభిప్రాయాలు .. వీటితో టీవీ 9 కి గానీ, టీవీ 9 వెబ్ సైట్ తో గానీ ఎలాంటి సంబంధం లేదని మనవి.