అప్పన్న భక్తులకు గుడ్ న్యూస్.. ‘ప్రసాద్’‌కు ఎంపికైన ఆలయం

|

Jul 30, 2020 | 4:17 PM

Simhadri Appanna Temple : శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానానికి అరుదైన గౌరవం దక్కింది. ఆలయాన్ని ప్రసాద్ ( నేష‌న‌ల్ మిష‌న్ ఆన్ ది పిలిగ్రిమేజ్ రెజువినేష‌న్ అండ్ స్పిర్చువ‌ల్ అజ్‌మెంటేష‌న్ డ్రైవ్‌) స్కీమ్‌కు ఎంపిక చేసింది కేంద్ర. పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని పలు ప్రఖ్యాత తీర్థయాత్ర స్థలాలను ఎంపిక చేసి అభివృద్ధి చేస్తోంది. దేశవ్యాప్తంగా ‘ప్రసాద్’స్కీంలో ఇప్పటి వరకు 5 ఆలయాలు ఉన్నాయి. వాటిలో విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం దేవస్థానాన్ని […]

అప్పన్న భక్తులకు గుడ్ న్యూస్.. ప్రసాద్‌కు ఎంపికైన ఆలయం
Follow us on

Simhadri Appanna Temple : శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానానికి అరుదైన గౌరవం దక్కింది. ఆలయాన్ని ప్రసాద్ ( నేష‌న‌ల్ మిష‌న్ ఆన్ ది పిలిగ్రిమేజ్ రెజువినేష‌న్ అండ్ స్పిర్చువ‌ల్ అజ్‌మెంటేష‌న్ డ్రైవ్‌) స్కీమ్‌కు ఎంపిక చేసింది కేంద్ర. పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని పలు ప్రఖ్యాత తీర్థయాత్ర స్థలాలను ఎంపిక చేసి అభివృద్ధి చేస్తోంది. దేశవ్యాప్తంగా ‘ప్రసాద్’స్కీంలో ఇప్పటి వరకు 5 ఆలయాలు ఉన్నాయి. వాటిలో విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం దేవస్థానాన్ని ఒకటిగా ఎంపిక చేశారు.

దీనిపై శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం చైర్మన్ సంచ‌యిత గ‌జ‌ప‌తి రాజు హర్షం వ్యక్తం చేశారు. సింహాచలం దేవస్థానాన్ని రాబోయే సంవత్సరాల్లో ప్రపంచంలోని హిందువులకు పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని ఆమె అన్నారు.