పుత్తడి దిశగా వెండి పరుగులు

|

Aug 14, 2019 | 12:04 PM

పసిడి పరుగులు పెడుతుంటే..వెండి వేగం పుంజుకుంటోంది…సామాన్యులకు దొరకనంత వేగంగా ఈ రెండు దూసుకెళ్తున్నాయి. ప్రాచీన కాలం నుండి విలువైన లోహంగా వెండి ప్రసిద్ధి. ఇది ఆభరణాలు, నాణేలు, వంటపాత్రలుగా ఉపయోగంలో ఉంది. కాగా ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లలో కూడా వెండిని విరివిగా వాడుతున్నారు. దీంతో వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయం సాగిస్తోంది. మంగళవారం దేశరాజధాని ఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండి ధరన ఏకంగా రూ.2,000లు పెరిగి రూ.45,000 స్థాయికి చేరింది. గతకొన్నేళ్లుగా […]

పుత్తడి దిశగా వెండి పరుగులు
Follow us on
పసిడి పరుగులు పెడుతుంటే..వెండి వేగం పుంజుకుంటోంది…సామాన్యులకు దొరకనంత వేగంగా ఈ రెండు దూసుకెళ్తున్నాయి. ప్రాచీన కాలం నుండి విలువైన లోహంగా వెండి ప్రసిద్ధి. ఇది ఆభరణాలు, నాణేలు, వంటపాత్రలుగా ఉపయోగంలో ఉంది. కాగా ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లలో కూడా వెండిని విరివిగా వాడుతున్నారు. దీంతో వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయం సాగిస్తోంది. మంగళవారం దేశరాజధాని ఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండి ధరన ఏకంగా రూ.2,000లు పెరిగి రూ.45,000 స్థాయికి చేరింది. గతకొన్నేళ్లుగా వెండి రేటు ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. పారిశ్రామిక యూనిట్లు, నాణేల తయారీదారుల నుంచి మంచి ఉన్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో రేటు గణనీయంగా పెరగడం ఇందుకు కారణమైందని బులియన్‌ వ్యాపారులు చెబుతున్నారు.