Salaar: ప్రభాస్ సరసన శృతి హాసన్.. అధికారికంగా ప్ర‌క‌టించిన ‘స‌లార్’ చిత్ర బృందం

|

Jan 28, 2021 | 11:37 AM

యంగ్ రెబల్ స్టార్ హీరో ప్ర‌భాస్ హీరోగా.. కేజీఎఫ్ దర్శకుడు ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించ‌నున్న చిత్రం స‌లార్. పాన్ ఇండియా మూవీగా..

Salaar: ప్రభాస్ సరసన శృతి హాసన్.. అధికారికంగా ప్ర‌క‌టించిన ‘స‌లార్’ చిత్ర బృందం
Follow us on

Shruti Haasan in Salaar Movie: యంగ్ రెబల్ స్టార్ హీరో ప్ర‌భాస్ హీరోగా.. కేజీఎఫ్ దర్శకుడు ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించ‌నున్న చిత్రం స‌లార్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరగందూర్ నిర్మిస్తుండగా.. రవి బస్రూర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ హీరోయిన్‌గా ఎవరు నటించనున్నారన్న విషయంపై మూవీ మేకర్స్ గురువారం క్లారిటీ ఇచ్చారు. ముందుగా దిశా ప‌టానీ, శృతి హాస‌న్‌ పేర్లు వినిపించిన సంగతి తెలిసిందే. కాగా చివ‌రికి శృతి హాస‌న్‌ని క‌న్‌ఫాం చేస్తూ మూవీ మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు.

ఈ రోజు శృతి హాసన్ 35వ జన్మదినం సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ఈ విష‌యాన్ని ప్రకటించింది. ముద్దుగుమ్మ శృతి ప్ర‌భాస్‌తో తొలిసారిగా న‌టించనుంది. అంతేకాకుండా కేజీఎఫ్ దర్శకుడు ప్ర‌శాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే తెలంగాణలోని సింగరేణి ఏరియాలో ప్రారంభంకానుంది. రామగుండం-3 పరిధిలోని సింగరేణి ఓసీపీ-2లో ప‌ది రోజుల పాటు యాక్ష‌న్ స‌న్నివేశాలను చిత్రీకరించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.