నార్త్ కొరియాలో ఆహార కొరత, కుక్కలపై కిమ్ జోంగ్ ‘ప్రతాపం’ !

| Edited By: Pardhasaradhi Peri

Aug 17, 2020 | 8:24 PM

నార్త్ కొరియాలో ఆహార కొరత ఏర్పడింది. దీంతో అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కుక్కలపై 'పడ్డారు'. పెంపుడు కుక్కలు కేపిటలిస్ట్ విధానాలకు ప్రతీక అని, అందువల్ల ప్యాంగ్ యాంగ్ లోని..

నార్త్ కొరియాలో ఆహార కొరత, కుక్కలపై కిమ్ జోంగ్ ప్రతాపం !
Follow us on

నార్త్ కొరియాలో ఆహార కొరత ఏర్పడింది. దీంతో అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కుక్కలపై ‘పడ్డారు’. పెంపుడు కుక్కలు కేపిటలిస్ట్ విధానాలకు ప్రతీక అని, అందువల్ల ప్యాంగ్ యాంగ్ లోని జాగిలాలను స్వాధీనం చేసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. శునకాలను పెంచుకోవడం చట్టానికి విరుధ్ధమని కూడా అన్నాడు. ఇది బూర్జువా ఐడియాలజీని ప్రతిబింబిస్తుందని, అందువల్ల అధికారులు ఏదో ఒక చర్య తీసుకోవాలని ఆయన సూచించాడు. దీంతో వారు కుక్కలను పెంచుకుంటున్న వారి ఇళ్లల్లో బలవంతపు సోదాలను ప్రారంభించారు. పట్టుకున్నవాటిని జూలకు గానీ, హోటళ్లకు అమ్మడం గానీ చేస్తున్నారు.

నార్త్ కొరియాలో ఆహార కొరత తీవ్రంగా ఉందని ఐరాస నివేదిక ఒకటి ఇటీవల పేర్కొంది. పైగా ఈ దేశంలో శునకాల మాంసానికి డిమాండ్ కూడా ఉంది. నార్త్ కొరియా అణు క్షిపణుల పరీక్షలను కూడా నిర్వహిస్తుండటంతో ఈ దేశంపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో ఇక్కడ తీవ్ర ఆహారకొరత ఏర్పడింది.

Video Credits: UK Daily Mail