ఉద్యోగులకు యాక్సెంచర్ షాక్

ఐర్లాండ్ కు చెందిన గ్లోబల్ ఐటీ సేవల దిగ్గజం యాక్సెంచర్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పబోతోందా..? అంటే.. అవునంటున్నాయి మార్కెట్ వర్గాలు. ప్రపంచవ్యాప్తంగా 5లక్షల పైచిలుకు సాఫ్ట్ వేర్ నిఫుణులకు ఉద్యోగాలు కల్పిస్తున్న..

  • Pardhasaradhi Peri
  • Publish Date - 6:45 pm, Wed, 26 August 20
ఉద్యోగులకు యాక్సెంచర్ షాక్

ఐర్లాండ్ కు చెందిన గ్లోబల్ ఐటీ సేవల దిగ్గజం యాక్సెంచర్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పబోతోందా..? అంటే.. అవునంటున్నాయి మార్కెట్ వర్గాలు. ప్రపంచవ్యాప్తంగా 5లక్షల పైచిలుకు సాఫ్ట్ వేర్ నిఫుణులకు ఉద్యోగాలు కల్పిస్తున్న ఈ సంస్థ ఒక్క భారత్‌లోనే 2 లక్షల మందికి ఉపాది కల్పిస్తోంది. కంపెనీలో పనిచేసే 5 శాతం ఉద్యోగులకు ఉద్వాసన పలకాలన్న ఆలోచనతో ఉన్నట్టు ఆస్ట్రేలియన్ ఫైనాన్షియల్ రివ్యూ తేల్చేసింది. సంస్థ ఇంటర్నల్ మీటింగ్ లో ఈ మేరకు నిర్ణయం చేసినట్టు తెలిపింది. కొత్త నియామకాలు చేపట్టకూడదని, కాంట్రాక్ట్‌లను తగ్గించడంతో పాటు ప్రస్తుతం పని చేస్తున్న నైపుణ్యం లేని ఉద్యోగులకు టాటా చెప్పాలని యోచిస్తుందని తెలుస్తోంది. క్లయింట్లకు కేటాయించాల్సిన పనిగంటలు భారీగా తగ్గడంతో ఈ మార్పులు అనివార్యమయ్యాయని కంపెనీ అంటున్నట్టు తెలుస్తోంది. అయితే, నైపుణ్యం కలిగిన టెకీల ఉద్యోగాలకు ఎలాంటి ముప్పూ ఉండదని సంస్థ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇదిలాఉంటే, జూలై 1వ తేదీనే గార్డియన్ నివేదిక యాక్సెంచర్‌లో భారీగా ఉద్యోగాల కోత ఉంటుందని అంచనాకు వచ్చింది. మరోవైపు టాప్ ఐటీ కంపెనీలైన కాగ్నిజెంట్‌, ఐబీఎమ్‌ కూడా ఇప్పటికే పలువురు ఉద్యోగులకు ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే.