అంబానీ ఇంటికి వారసుడొచ్చాడు…మగబిడ్డకు జన్మనిచ్చిన శ్లోక .. శ్రీకృష్ణ పరమాత్ముడి దయేనంటున్న ముకేష్

|

Dec 13, 2020 | 8:10 AM

బిలియనీర్‌ ముకేష్‌ అంబానీ ప్రమోషన్‌ అందుకున్నారు. ఆయన పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ సతీమణి శ్లోకా అంబానీ గురువారం మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, కొడుకు ఇరువురు క్షేమంగా ఉన్నట్లు..

అంబానీ ఇంటికి వారసుడొచ్చాడు...మగబిడ్డకు జన్మనిచ్చిన శ్లోక .. శ్రీకృష్ణ పరమాత్ముడి దయేనంటున్న ముకేష్
Follow us on

Mukesh Ambani Newborn Grandson : ప్రముఖ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి కొత్త వారసుడొచ్చాడు. బిలియనీర్‌ ముకేష్‌ అంబానీ ప్రమోషన్‌ అందుకున్నారు. ఆయన పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ సతీమణి శ్లోకా అంబానీ గురువారం మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, కొడుకు ఇరువురు క్షేమంగా ఉన్నట్లు అంబానీ కుటుంబ అధికార ప్రతినిధి ప్రకటనలో తెలిపారు. శ్రీకృష్ణ పరమాత్ముడి దయ, ఆశీర్వాదాలతో శ్లోక, ఆకాశ్ అంబానీ ఓ బిడ్డకు గర్వించదగ్గ తల్లిదండ్రులయ్యారు అని ప్రకటనలో పేర్కొన్నారు. తాము నానమ్మ, తాతయ్య కావడంపై ముకేష్ అంబానీ, నీతా దంపతులు చాలా సంతోషంగా ఉన్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రముఖ వజ్రాల వ్యాపారి రుస్సెల్‌ మెహతా కుమార్తె శోక్లాతో ఆకాశ్‌ వివాహం మార్చి 2019లో జరిగిన విషయం తెలిసిందే. అంబానీ(63), నీతా దంపతులకు ముగ్గురు సంతానం. 29 ఏళ్ల కవలలు ఆకాశ్‌, ఇషా… అనంత్‌(25) మూడో కుమారుడు. గతకొంతకాలంగా విదేశాల్లో ఉన్న అంబానీ కుటుంబం దీపావళి పర్వదినం ముందే ముంబైకి చేరుకుంది. మొదటిసారి నానమ్మ, తాతయ్య ప్రమోషన్‌ అందుకోవడంపై నీతా, ముఖేష్ అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. ధీరూబాయి-కోకిలాబెన్‌ అంబానీల ముని మనవడికి స్వాగతం అని అన్నారు.