ప్రకాశం జిల్లాలో పొలిటికల్ హీట్..ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం..బయటపడిన విబేధాలు

|

Dec 26, 2020 | 8:58 PM

ప్రకాశంజిల్లా వేటపాలెం మండలం అక్కయ్యపాలెంలో పేదల పట్టాల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. ఎమ్మెల్యే కరణం బలరాంకు మద్దతుగా ఉన్న వైసీపీ నేతల మద్య విబేధాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే కరణం బలరాంను 2024 ఎన్నికల్లో..

ప్రకాశం జిల్లాలో పొలిటికల్ హీట్..ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం..బయటపడిన విబేధాలు
Follow us on

ప్రకాశంజిల్లా వేటపాలెం మండలం అక్కయ్యపాలెంలో పేదల పట్టాల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. ఎమ్మెల్యే కరణం బలరాంకు మద్దతుగా ఉన్న వైసీపీ నేతల మద్య విబేధాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే కరణం బలరాంను 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి నిలబెట్టి తిరిగి ఎమ్మెల్యేగా గెలిపించాలని సభలో మాజీ మంత్రి పాలేటి రామారావు వ్యాఖ్యలు చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. అప్పటి సంగతి ఇప్పుడెందుకంటూ పాలేటి రామారావుతో తీవ్ర వాగ్వివాదానికి దిగారు.

నువ్వేమన్నా పార్టీ అధ్యక్షుడివా… అప్పటి టెక్కెట్‌ గురించి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నావంటూ సునీత విరుచుకుపడ్డారు. అది నా ఇష్టం… మాకు కరణం బలరాం మళ్లీ ఎమ్మెల్యేగా కావాలంటూ పాలేటి రామారావు సమాధాన మిచ్చారు. అది నువ్వెలా డిసైడ్‌ చేస్తావంటూ సునీత మాటకు మాట జవాబిచ్చారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన కరణం బలరాం, పోతుల సునీతపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అర్ధంపర్ధంలేక మాట్లాడకు… నువ్వు కూడా మాట్లాడాలనుకుంటే మాట్లాడు అంటూ ఆమెను వారించారు. అదేంటండి అప్పటి టికెట్‌ గురించి మాట్లాడే సభ ఇది కాదు కదా అంటూ సునీత కరణం బలరాంను ప్రశ్నించారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు వ్యతిరేకంగా కూటమి కట్టిన వైసీపీ నేతలంతా ఉన్న వేదికపై వారిలో వారే గొడవ పడడంతో.. రాజకీయం రసవత్తరంగా మారింది.