AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రసవం కోసం ఆసుపత్రికి.. చివరకు తీరని విషాదం! షాద్‌నగర్‌ ఆస్పత్రిలో ఏం జరిగింది?

షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరిన రాధ, ఆమె శిశువు మృతి చెందారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడం, అత్యవసర సేవల్లో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెలికితీయాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రసవం కోసం ఆసుపత్రికి.. చివరకు తీరని విషాదం! షాద్‌నగర్‌ ఆస్పత్రిలో ఏం జరిగింది?
Shadnagar Hospital
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Oct 31, 2026 | 3:51 PM

Share

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరిన గర్భిణి రాధ, ఆమె కడుపులోని శిశువు మృతి చెందడంతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరైంది. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కొందుర్గ్‌ మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన రాధ నిండు గర్భిణి. ప్రసవం కోసం కుటుంబ సభ్యులు శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఆమెను షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్య సిబ్బంది సాధారణ ప్రసవం అయ్యే అవకాశం ఉందని, కొంతసేపు వేచి చూడాలని సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం ఆమెను ఆసుపత్రిలో చేర్చి గ్లూకోజ్‌ ఎక్కించారని చెప్పారు. అయితే, ఆ తర్వాత తల్లి ఆరోగ్య పరిస్థితిని, గర్భంలోని శిశువు కదలికలను వైద్య సిబ్బంది సరిగా పర్యవేక్షించలేదని బంధువులు ఆరోపించారు. ఉదయం నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సరైన వైద్యం అందించకుండా కాలయాపన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సాయంత్రం రాధ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించిందని, నోటిలో నుంచి నురగలు రావడంతో ఆమె కుప్పకూలిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. పరిస్థితి విషమించిన తర్వాత ఆమెకు ఫిట్స్‌ వస్తున్నాయని, ఇక్కడ చికిత్స అందించడం సాధ్యం కాదని చెప్పి హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించినట్లు ఆరోపించారు. అయితే, అప్పటికే తల్లీబిడ్డ ఇద్దరూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

హైదరాబాద్‌కు తీసుకెళ్లిన అనంతరం అక్కడి వైద్యులు కూడా ఇద్దరూ ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారని తెలిపారు. మరోవైపు, అత్యవసర పరిస్థితిలో ప్రభుత్వ అంబులెన్స్‌ సదుపాయం కూడా కల్పించలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్‌ అంబులెన్స్‌ను ఏర్పాటు చేసుకుని రూ.9,000 చెల్లించి రాధను హైదరాబాద్‌కు తరలించాల్సి వచ్చిందని తెలిపారు. మృతి చెందిన తర్వాత కూడా సీపీఆర్‌ చేసినట్లు చూపించి ఘటన నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారని ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఆరోపించారు. తల్లీబిడ్డ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. ఘటనకు బాధ్యులైన వైద్యులు, సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, వైద్యుల నిర్లక్ష్యంపై వచ్చిన ఆరోపణలు ఇంకా అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. తల్లీబిడ్డ మృతికి గల అసలు కారణాలు, ఆసుపత్రి సిబ్బంది వ్యవహరించిన తీరుపై అధికారిక విచారణలో స్పష్టత రావాల్సి ఉంది.

Follow Us
ఏసీ విషయంలో అందరూ చేసే తప్పు ఇదే.. వీటిని లైట్ తీసుకుంటే..
ఏసీ విషయంలో అందరూ చేసే తప్పు ఇదే.. వీటిని లైట్ తీసుకుంటే..
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. బస్సుల్లో చోరీల స్కెచింగ్!
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. బస్సుల్లో చోరీల స్కెచింగ్!
స్వీట్ బజ్జీలు ఎప్పుడైనా ట్రై చేశారా? పిల్లలు ఇష్టంగా తింటారు!
స్వీట్ బజ్జీలు ఎప్పుడైనా ట్రై చేశారా? పిల్లలు ఇష్టంగా తింటారు!
దంచికొట్టే వానల్లో సాయంత్రం పూట ప్లేట్ తింటే.. ఇమ్యూనిటీ డబుల్
దంచికొట్టే వానల్లో సాయంత్రం పూట ప్లేట్ తింటే.. ఇమ్యూనిటీ డబుల్
నూనె తక్కువ.. మసాలాలు లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలంటే?
నూనె తక్కువ.. మసాలాలు లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలంటే?
రబీ సీజన్‌లో ఈ 5 పంటలతో మంచి ఆదాయం పొందవచ్చు!
రబీ సీజన్‌లో ఈ 5 పంటలతో మంచి ఆదాయం పొందవచ్చు!
ప్రసవం కోసం ఆసుపత్రికి.. చివరకు తీరని విషాదం! షాద్‌నగర్‌ ఆస్పత్రి
ప్రసవం కోసం ఆసుపత్రికి.. చివరకు తీరని విషాదం! షాద్‌నగర్‌ ఆస్పత్రి
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. కొబ్బరి నీళ్లతో ఇంత జరుగుతుందా..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. కొబ్బరి నీళ్లతో ఇంత జరుగుతుందా..
రాత్రికి రాత్రే పరిస్థితులు తారు మారు..అర్ధరాత్రి ఏం జరగనున్నదంటే
రాత్రికి రాత్రే పరిస్థితులు తారు మారు..అర్ధరాత్రి ఏం జరగనున్నదంటే
నవంబర్ 2026 కన్య రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో అధికార యోగం!
నవంబర్ 2026 కన్య రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో అధికార యోగం!