మా విద్యార్థుల నష్టాన్ని ఎవరు భరిస్తారు.?

|

Sep 02, 2020 | 9:04 PM

విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే అధికారం కేంద్రానికి ఎవరిచ్చారని మండిపడ్డారు బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ. జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలని..

మా విద్యార్థుల నష్టాన్ని ఎవరు భరిస్తారు.?
Follow us on

విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే అధికారం కేంద్రానికి ఎవరిచ్చారని మండిపడ్డారు బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ. జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలని కోరారు. నిన్న జరిగిన జేఈఈ మెయిన్ పరీక్షలను పశ్చిమబెంగాల్ లోని 75 శాతం మంది విద్యార్థులు రాయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,652 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా… కేవలం 1,167 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారని చెప్పారు. కరోనా కారణంగా విద్యార్థులు అవకాశాన్ని కోల్పోయారని అన్నారు. ప్రస్తుత కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం పరీక్షను నిర్వహించడం దారుణమని అన్నారు. అన్ లాక్-4 నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లోకల్ లాక్ డౌన్ ను విధించకూడదనే కేంద్ర హోంశాఖ ఉత్తర్వులపై కూడా మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉందో జిల్లా యంత్రాంగానికే తెలుస్తుందని అన్నారు. ఫెడరలిజంకు ఇదే కీలకమని చెప్పారు. కోల్ కతా మెట్రో రైలు సేవలను ప్రారంభించే అంశంపై ఈ నెల 15 లోపల నిర్ణయం తీసుకుంటామని మమత పేర్కొన్నారు.