దక్షిణాది రాష్ట్రాలకు ‘ఉగ్ర’ హెచ్చరికలు

| Edited By:

Apr 27, 2019 | 11:58 AM

శ్రీలంకలో భీకర ఉగ్రదాడుల తరువాత భారత పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో(ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు) ఉగ్రదాడులు జరగొచ్చంటూ కర్ణాటక డీజీ- ఐజీపీ అధికారులకు సమాచారం అందింది. తమిళనాడు నుంచి ఓ లారీ డ్రైవర్ ఈ విషయాన్ని ఫోన్ చేసి చెప్పారని.. తక్షణమే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాల అధికారులను కర్ణాటక పోలీస్ అధికారులు అప్రమత్తం చేశారు. కాగా దక్షిణాది రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, గోవాలోని ముఖ్య పట్టణాలకూ […]

దక్షిణాది రాష్ట్రాలకు ‘ఉగ్ర’ హెచ్చరికలు
Follow us on

శ్రీలంకలో భీకర ఉగ్రదాడుల తరువాత భారత పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో(ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు) ఉగ్రదాడులు జరగొచ్చంటూ కర్ణాటక డీజీ- ఐజీపీ అధికారులకు సమాచారం అందింది. తమిళనాడు నుంచి ఓ లారీ డ్రైవర్ ఈ విషయాన్ని ఫోన్ చేసి చెప్పారని.. తక్షణమే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాల అధికారులను కర్ణాటక పోలీస్ అధికారులు అప్రమత్తం చేశారు. కాగా దక్షిణాది రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, గోవాలోని ముఖ్య పట్టణాలకూ ఉగ్ర ముప్పు ఉందని వారు తెలిపారు.

ఈ మేరకు ఓ లేఖను పంపిన కర్ణాటక డీజీ-ఐజీపీ అధికారులు.. ‘‘లారీ డ్రైవర్‌నని చెప్పిన ఓ వ్యక్తి బెంగళూరు పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చేశాడు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్ఛేరి, గోవా, మహారాష్ట్రల్లోని ముఖ్య పట్టణాల్లో ఉగ్రదాడులు జరుగుతాయని తన వద్ద సమాచారం ఉందని తెలిపాడు. రైళ్లలో ఈ దాడులు జరగొచ్చునని అతడు పేర్కొన్నాడు. తమిళనాడు రామనాథపురంలో 19మంది తీవ్రవాదులు ఉన్నారని అతడు చెప్పాడు. తక్షణమే అవసరమైన చర్యలు తీసుకొని ఎలాంటి ఘటనలు జరగకుండా చూడండి’’ అంటూ పేర్కొన్నారు.