కరోనాపై పోరులో నిండు గర్భిణి.. హ్యాట్సాఫ్ అనాల్సిందే..

| Edited By:

Apr 20, 2020 | 11:04 PM

కోవిద్-19 భారత్ లో విజృంభిస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం లాక్ డౌన్ ను మే 3వరకు పొడిగించైనా విషయం తెలిసిందే. ఎంతటి కష్టాలున్నా సరే... నిబద్ధతతో విధులు నిర్వర్తించే పోలీసులు ఇంకా ఉన్నారన్నది ఛత్తీస్‌గఢ్

కరోనాపై పోరులో నిండు గర్భిణి.. హ్యాట్సాఫ్ అనాల్సిందే..
Follow us on

కోవిద్-19 భారత్ లో విజృంభిస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం లాక్ డౌన్ ను మే 3వరకు పొడిగించైనా విషయం తెలిసిందే. ఎంతటి కష్టాలున్నా సరే… నిబద్ధతతో విధులు నిర్వర్తించే పోలీసులు ఇంకా ఉన్నారన్నది ఛత్తీస్‌గఢ్ ఘటనతో మరోసారి రుజువైంది. అమృత సోరీ ధృవ్… 2007 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆమె ఏడు నెలల నిండు గర్భిణి. అయినా సరే… రోడ్డుపైకి వచ్చి అందరితో పాటే కోవిడ్ – 19, లాక్‌డౌన్ విధులను నిర్వర్తిస్తున్నారు.

కాగా.. ‘‘కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి, లాక్‌డౌన్‌ విజయవంతం చేయడానికి ఆరోగ్య శాఖ అధికారులు, పోలీసు అధికారులతో పాటు మొత్తం జిల్లా అధికారులు ముందుకొచ్చి విధులు నిర్వర్తిస్తున్నారు. నేనెందుకు విధులు నిర్వర్తించకూడదు? ఓ ఛాలెంజ్‌గా నేనూ విధులు నిర్వర్తిస్తున్నా. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నా. అత్యవసరం అయితే కచ్చితంగా సెలవులు తీసుకుంటా. తమ సీనియర్ అధికారులు నాపై ఎలాంటి ఒత్తిడి పెట్టడం లేదు.’’  అని అమృత తెలిపారు.

మరోవైపు.. ప్రతి రోజూ తన ఆఫీసు విధులను ముగించుకొని… ప్రధాన కేంద్రాల్లో పర్యటనకు బయల్దేరుతారు. పోలీసు శాఖ వారు లాక్‌డౌన్ మార్గదర్శకాలను పక్కాగా పాటిస్తున్నారా? లేదా? అని స్వయంగా ఆమె పర్యవేక్షిస్తుంటారు. సాధారణ రోజుల్లో పోలీసులు వ్యవహరించే తీరుకీ, లాక్‌డౌన్ సమయంలో వ్యవహరించే తీరుకీ చాలా తేడా ఉందన్నారు. ఇప్పుడు మాత్రం కసురు కోకుండా, ప్రజలను సముదాయిస్తూ, ఓ మెంటర్‌లా విధులు నిర్వర్తించాలని, అలాగే ప్రజల అవసరాలు కూడా తీరుస్తుండాలని అమృత పేర్కొన్నారు.