sesame seeds benefits: ఉదయాన్నే ఖాళీ కడుపుతో నువ్వులు తింటే ఎన్ని లాభాలునున్నాయో తెలుసా..

|

Feb 07, 2021 | 8:25 PM

భారతీయ వంటిళ్లలో నువ్వుల్ని అధికంగా వాడుతుంటాం. వంటల్లో కాకుండా.. మాములుగా నువ్వుల ఉండలు, నువ్వుల పోడి ఇలా చాలా రకాలుగా వీటిని ఉపయోగిస్తుంటాం. నువ్వులు రుచికి మాత్రమే

sesame seeds benefits: ఉదయాన్నే ఖాళీ కడుపుతో నువ్వులు తింటే ఎన్ని లాభాలునున్నాయో తెలుసా..
Follow us on

భారతీయ వంటిళ్లలో నువ్వుల్ని అధికంగా వాడుతుంటాం. వంటల్లో కాకుండా.. మాములుగా నువ్వుల ఉండలు, నువ్వుల పోడి ఇలా చాలా రకాలుగా వీటిని ఉపయోగిస్తుంటాం. నువ్వులు రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనం చేకురుస్తాయి. అవెంటే తెలుసుకుందాం.

రోజూవారీ ఆహరంలో నువ్వులను తీసుకోవడం వలన కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ లెవెల్స్ తగ్గుతాయట. అంతేకాకుండా గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలోనూ తోడ్పడుతాయి. ఇందులో ఎక్కువగా పీచు పదార్థం ఉండడం వలన అరుగుదల బాగుంటుంది. డయాబెటీస్, ఒబేసిటీ వంటి వ్యాధులను నివారించడానికి ఇవి ఉపయోగపడుతాయి. నువ్వుల్లో ఉండే ఐరన్, కాపర్, విటమిని బీ6, సెల్ ఫార్మేషన్‏కి సెల్ ఫంక్షన్‏కి అవసరమవుతాయి. ఇందులో ఉండే హెల్తీ ఫ్యాట్స్, హై క్యాలిటీ ప్రొటీన్ కంటెంట్ వలన బ్లడ్ షుగర్‏ను కూడా కంట్రోల్ చేస్తాయి. అలాగే ఇందులో ఉండే విటమిన్ ఈ, ప్లాంట్ కాంపౌండ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేసి, బాడీలో ఉండే ఆక్సిడేటివ్ స్టెస్‏ని తగ్గిస్తాయి. నువ్వుల్లో థయామిన్, నియాసిన్, విటమిన్ బీ6 మెటబాలిజంకు సహయపడుతుంటాయి.

నువ్వులను ప్లాంట్ ప్రొటీన్ సోర్సెస్‏లో ఒకటిగా చెబుతుంటారు. ఇందులో ఉండే ప్రొటీన్ ఆరోగ్యానికి చాలా అవసరం. కీళ్ళ నొప్పుల నుంచి హార్మోన్ సమస్యల వరకు నువ్వుల్లో ఉండే ప్రొటీన్ సహయపడుతుంది. వీటితో పాటు రాజ్మా, శనగలు తీసుకోవడం వలన కూడా కీళ్ళ నొప్పులు నుంచి ఉపశమనం కలుగుతుంది. బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ నువ్వులను తీసుకోవడం వలన బ్లడ్ ప్రెషర్ తగ్గించాడానికి సహయపడుతుంది. అలాగే ఆర్టరీస్‏లో ప్లేక్ బిల్డప్‏ని కూడా కంట్రోల్ చేస్తాయి.

Also Read:

Health: దానిమ్మ పండు… పోషకాలు మెండు.. దీని ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా..?