గుడ్ న్యూస్ చెప్పిన సీరమ్ సంస్థ.. డిసెంబర్ నాటికి 100 మిలియన్ ‘ఆస్ట్రా’ వ్యాక్సిన్ డోసులు రెడీ.!

|

Nov 13, 2020 | 6:24 PM

ఆక్స్‌ఫోర్డ్ యూనివర్సిటీ- ఆస్ట్రాజెనికా సంస్థలు సంయుక్తంగా కలిసి అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా..

గుడ్ న్యూస్ చెప్పిన సీరమ్ సంస్థ.. డిసెంబర్ నాటికి 100 మిలియన్ ఆస్ట్రా వ్యాక్సిన్ డోసులు రెడీ.!
Follow us on

Serum Institute: ఆక్స్‌ఫోర్డ్ యూనివర్సిటీ- ఆస్ట్రాజెనికా సంస్థలు సంయుక్తంగా కలిసి అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా.. భారత్‌లో ‘కోవిషీల్డ్’ పేరుతో అందుబాటులోకి తీసుకురానున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ వ్యాక్సిన్‌కు సంబంధించిన పలు కీలక విషయాలను సంస్థ సీఈవో అదర్ పునావాలా వెల్లడించారు.

డిసెంబర్ నాటికి 100 మిలియన్ వ్యాక్సిన్ డోసులను సిద్దం చేస్తున్నామని.. వీటిని అదే నెలలో దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యే టీకాల డ్రైవ్‌లో ఉపయోగిస్తామని చెప్పుకొచ్చారు. అలాగే వ్యాక్సిన్ చివరి దశ క్లినికల్ ట్రయిల్స్ కూడా సత్ఫలితాలను చూపిస్తే.. 1 బిలియన్ కోవిడ్ వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తికి కేంద్రం నుంచి అత్యవసర అనుమతులు పొందే అవకాశం ఉందని అదర్ పునావాలా ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

కాగా, కరోనా వ్యాక్సిన్ అభివృద్దిలో భాగంగా సీరం ఇన్స్టిట్యూట్ ఇప్పటిదాకా ఐదు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాదు గత రెండు నెలల్లో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ 40 మిలియన్ మోతాదులను సిద్దం చేసింది. అలాగే త్వరలోనే నోవా వాక్స్ టీకాలను తయారు చేసేందుకు రెడీ అవుతోంది.

Also Read:

మెగాస్టార్ చిరంజీవికి కరోనా నెగటివ్.. కాలం, కరోనా నన్ను కన్ఫ్యూజ్ చేశాయంటూ ట్వీట్..

పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పరీక్షలపై కీలక నిర్ణయం.!

రైలు ప్రయాణీకులకు ముఖ్య గమనిక.. 12 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. వివరాలివే..!

ఏపీ: సీఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్.. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ గడువు పొడిగింపు..

కూతురు పుట్టింది.. అదృష్టాన్ని తెచ్చింది.. మురిసిపోతున్న యువ పేసర్ నటరాజన్..