విజయవాడలో కరోనా 40% మందికి వచ్చింది.. పోయింది..

విజయవాడ, పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన సిరో సర్వైలెన్స్, వివిధ రకాల వైరస్ పరీక్షల విశ్లేషణలో సుమారు 40% మందికి తెలియకుండానే కరోనా వచ్చి పోయినట్లు వైద్యాధికారులు గుర్తించారు.

విజయవాడలో కరోనా 40% మందికి వచ్చింది.. పోయింది..

Updated on: Aug 20, 2020 | 11:20 PM

Sero Surveillance In Vijayawada: విజయవాడ, పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన సిరో సర్వైలెన్స్, వివిధ రకాల వైరస్ పరీక్షల విశ్లేషణలో సుమారు 40% మందికి తెలియకుండానే కరోనా వచ్చి పోయినట్లు వైద్యాధికారులు గుర్తించారు. వీరిలో ఎక్కువ శాతం మందికి లక్షణాలు లేవని తేలింది. కరోనా వైరస్ వ్యాప్తి, ఇన్‌ఫెక్షన్‌ రేట్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు వైద్య అధికారులు ఇటీవల ‘సిరో సర్వైలెన్స్’ నిర్వహించారు. ఈ విశ్లేషణలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా 20 శాతం మందికి తెలియకుండానే కరోనా వచ్చి.. వెళ్లింది. విజయవాడ అర్బన్‌లో 378 మందికి కరోనా యాంటీ బాడీలు ఉన్నట్లు గుర్తించారు.

అలాగే రాణిగారితోటలో 29, లంబాడిపేటలో 18, రామలింగేశ్వరనగర్‌లో 18, దుర్గాపురంలో 17, మధురానగర్‌లో 20, గిరిపురంలో 18, ఎన్టీఆర్ కాలనీ 16, ఆర్ఆర్ పేట 16, లబ్బీపేట 4, పటమటలోని 5 మందిలో కరోనా యాంటీ బాడీలు వృద్ది చెందినట్లు వైద్యులు గుర్తించారు. గ్రామీణ ప్రాంతాలైన కానూరులో 8 మందికి, గొల్లమూడిలో 14 మందికి, చిన్న ఓగిరాలలో 15, గొల్లపల్లిలో 9 మందికి యాంటీ బాడీలు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. విజయవాడలోని వివిధ ప్రాంతాల్లో మే నెలాఖరు వరకు నమోదైన కేసులను పరిగణనలోకి తీసుకుని ఈ పరీక్షలు చేశారు. కాగా, ఇలాగే తెలియకుండానే కరోనా వచ్చి.. వెళ్లినవారి సంఖ్య ఢిల్లీలో 23 శాతం ఉండగా, మహారాష్ట్రలోని ఓ మురికివాడలో 43 శాతం ఉందని సిరోస్ సర్వైలెన్స్ విశ్లేషణలో తేలింది.

Also Read:

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. ‘వైఎస్సార్ ఆసరా’కు కేబినెట్ ఆమోదం..

మురుగునీటిలో కరోనా వైరస్.. తేల్చేసిన పరిశోధకులు..

డిలేట్ చేసిన వాట్సాప్ వీడియోలు, ఇమేజ్స్‌ను రికవర్ చేయండిలా..

Loading...
Unable to load recommendations.
Follow Us