
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 193 పాయింట్లు నష్టపోయి.. 39,756 వద్ద ట్రేడింగ్ ముగించగా.. నిఫ్టీ 58 పాయింట్లు నష్టపోయి 11,906 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, ఆటోమొబైల్ షేర్లు భారీగా నష్టపోగా.. టాటా స్టీల్ షేర్లు భారీగా లాభపడ్డాయి.