‘రిమోట్ కంట్రోల్ మా చేతుల్లో’.. శివసేన వార్నింగ్

|

Oct 27, 2019 | 5:13 PM

మహారాష్ట్రలో అధికార పగ్గాలకు సంబంధించి బీజేపీ-శివసేన మధ్య ‘ సిగపట్లు ‘ ప్రారంభమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయంలో ‘ రిమోట్ కంట్రోల్ ‘ తమ చేతుల్లో ఉందని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్.. బీజేపీని హెచ్ఛరించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ కన్నా తమ పార్టీ తక్కువ సీట్లు గెలుచుకున్నప్పటికీ.. సంజయ్ మాత్రం తగ్గడంలేదు. 50: 50 వాటా ఉండవలసిందే అంటున్నారు. గతంతో అంటే.. 2014 తో పోలిస్తే ఈ సారి సేన […]

రిమోట్ కంట్రోల్ మా చేతుల్లో.. శివసేన వార్నింగ్
Follow us on

మహారాష్ట్రలో అధికార పగ్గాలకు సంబంధించి బీజేపీ-శివసేన మధ్య ‘ సిగపట్లు ‘ ప్రారంభమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయంలో ‘ రిమోట్ కంట్రోల్ ‘ తమ చేతుల్లో ఉందని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్.. బీజేపీని హెచ్ఛరించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ కన్నా తమ పార్టీ తక్కువ సీట్లు గెలుచుకున్నప్పటికీ.. సంజయ్ మాత్రం తగ్గడంలేదు. 50: 50 వాటా ఉండవలసిందే అంటున్నారు. గతంతో అంటే.. 2014 తో పోలిస్తే ఈ సారి సేన తక్కువ సీట్లను గెలుచుకుంది, కానీ పవర్ షేరింగ్ కి సంబంధించి రిమోట్ కంట్రోల్ తమ చేతిలోనే ఉందని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ‘ మీ వెనుకే మేమున్నామనే మీ అభిప్రాయం ఈ ఎన్నికల ఫలితాలతో బద్దలైంది ‘ అని ఆయన కమలనాథులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాజా ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాలను, శివసేన 63 సీట్లను గెలుచుకున్నాయి. అయితే 288 స్థానాలున్న అసెంబ్లీలో ఈ పార్టీ మెజారిటీ మార్క్ ని(146) అందుకోలేకపోయింది. సమానంగా అధికారాన్ని పంచుకునేందుకు మీరు లిఖిత పూర్వక హామీని ఇవ్వాలని శివసేన… బీజేపీని డిమాండ్ చేయడం ఆశ్చర్యకరం.

మీకు, మా పార్టీ అధినేత ఉధ్ధవ్ థాక్రేకి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం దీన్ని మీరు గౌరవించాల్సిందే అని కేంద్ర హోం మంత్రి, పార్టీ అధ్యక్షుడు కూడా అయిన అమిత్ షా కు పంపిన లేఖలో సేన కోరింది. అయితే ఈ డిమాండుపై బీజేపీ ఇంకా స్పందించలేదు. ఈ పార్టీ ఎమ్మెల్యేలు ఈ నెల 30 న సమావేశం కానున్నారు. ఆరోజున అమిత్ షా.. ఉధ్ధవ్ తో భేటీ కానున్నారు. కాగా… ఈ ఎన్నికల్లో 54 సీట్లు గెలుచుకున్న ఎన్సీపీ.. శివసేనకు మద్దతునివ్వడం ఆశ్చర్యకరం. సేన డిమాండ్లు సరైనవేనని ఈ పార్టీ సీనియర్ నేత శరద్ పవార్ వ్యాఖ్యానించారు.