యువత జరభద్రం.. !

|

Aug 24, 2020 | 12:37 PM

సెల్ఫీ చిత్రాల మోజు.. యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పొంచి ఉన్న ప్రమాదాలను గుర్తించక సరదా ఆటలో సర్వం కోల్పోతున్నారు. కోరి ముప్పు తెచ్చుకుంటూ కొన ఉపిరిని వదులుతున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని సెల్ఫీల గోల ఎక్కువైంది..సెల్ఫీ దిగి ఆ చిత్రాలను వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో పెట్టాలని తపన పడుతున్నారు. ఆ అత్యుత్సాహం వారి ప్రాణాలను బలిగొంటోంది.

యువత జరభద్రం.. !
Follow us on

సెల్ఫీ చిత్రాల మోజు.. యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పొంచి ఉన్న ప్రమాదాలను గుర్తించక సరదా ఆటలో సర్వం కోల్పోతున్నారు. కోరి ముప్పు తెచ్చుకుంటూ కొన ఉపిరిని వదులుతున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని సెల్ఫీల గోల ఎక్కువైంది..సెల్ఫీ దిగి ఆ చిత్రాలను వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో పెట్టాలని తపన పడుతున్నారు. ఆ అత్యుత్సాహం వారి ప్రాణాలను బలిగొంటోంది. బిడ్డలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రులకు గర్భశోకం మిగులుతోంది..

సెల్ఫీ మోజు ప్రాణాలు తీస్తుందని తెలిసికూడా తమ విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కొందరు. ఎంతో భవిష్యత్తు వున్న యువతి యువకులు.. క్షణాల ఆనందం కోసం శాశ్వతంగా తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. జోరుగా కురుస్తున్న వానలకు ప్రాజెక్ట్‌లన్ని జలకళ సంతరించుకుంటున్నాయి. దీంతో ఆ అందాలను అస్వాదించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున్న ప్రాజెక్ట్‌లకు, వాటర్ పాల్స్ వద్దకు క్యూ కడుతున్నారు. వచ్చిన వారు ఆ అందాలను తమతో పాటు కెమెరాలో బంధించాలని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలా ఒకరా, ఇద్దరు కాదు ఈ మధ్యకాలంలో ఏకంగా ముగ్గురు ప్రాణాలు కొల్పోయారు..

మహబూబాబాద్‌ జిల్లా బయ్యారంలో జలపాతంలో సెల్ఫీ దిగుతూ గల్లంతైంది ఓ యువతి. సరదాగా జలపాతం వద్ద గడుపుతామని తల్లిదండ్రులతో కలిసి వచ్చింది. బ్రదర్‌ శివాజీ, పూజిత సరదాగా ఫోటో దిగితూ ప్రమాదవశాత్తు జలపాతంలో జారిపడ్డారు. వెంటనే అప్రమత్తమైన తండ్రి….శివాజీని రక్షించగా కూతురు పూజిత జలపాతంలో గల్లంతైంది.

అటు ఇదే సెల్ఫీ మోజు మరో యువకుడి ప్రాణం తీసింది.. మహబూబ్‌నగర్‌కు చెందిన బంధువు కుమారుడు శశిధర్‌గౌడ్‌, కుటుంబసభ్యులతో చెక్‌డ్యాం దగ్గరకు వెళ్లారు. అనంతరం అలుగు నీటిలోకి దిగి ఫొటోలు దిగారు. ఈ క్రమంలో అదుపుతప్పి పడిపోయి వరద ఉద్ధృతిలో కొట్టుకుపోతుండగా వెంకటేశ్‌గౌడ్‌ వెంటనే అప్రమత్తమై కుమార్తె గాయత్రిని, బంధువు కుమారుడు శశిధర్‌గౌడ్‌ను కాపాడాడు. మరింత లోపలికి వెళ్లిపోయిన కుమారుడు సాయిరాంగౌడ్‌ను రక్షించేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది.

ఇక మూసి ప్రాజెక్టు అందలాను అస్వాదించేందుకు వెళ్లి సెల్ఫీలు దిగుతూ ప్రమాదవశాత్తు కాలుజారి పడి బండరాళ్ళ లో చిక్కుకొని ఓ యవకుడు ప్రాణాలు కోల్పోయాడు. భారీ వర్షాలకు డ్యామ్‌ ఫుల్‌గా నిండింది. ఇప్పటికే అధికారులు గేట్లు ఎత్తి నీరు బయటకు వదిలారు. గేట్లు తెరవడంతో చుట్టుపక్కల గ్రామస్తులు డ్యామ్‌ ప్రవాహాన్ని చూడ్డానికి తరలి వస్తున్నారు. ఈ నేపధ్యంలోనే కొంతమంది యువకులు పోలీసులు ఆంక్షలను బేఖాతరు చేస్తూ నీట్లోకి దిగి సెల్ఫీలు దిగుతున్నారు.ఈ క్రమంలోనే సాయి అనే యువకుడు కాలుజారి కింద పడ్డాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయాడు.

స్మార్ట్ ఫోన్ మోజులో పడ్డ యువత అందరి దృష్టిలో పడేలనే తాపత్రయం ప్రాణాలమీదకు తెస్తోంది. సోషల్ మీడియాలో పెట్టే ఫొటోలకు ఎక్కువ లైకులు సంపాదించుకోవాలనే ఉత్సాహం, పోటాపోటీగా మారింది. దీనికి తోడు తమ పోస్టింగులు వైరల్ కావాలన్న ఫీవర్ పెరగడం మరొకటి. కొత్తదనంతో కూడిన సెల్ఫీల వేటలో యువత ఆ పని ఎంత ప్రమాదకరమైందన్న విషయం గమనించడం లేదు. అంతే తప్ప భద్రతాపరంగా కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఇంటర్నెట్, వాట్సప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా కనెక్షన్లు అరచేతిలోకి అందుబాటులో రావడం, షేరింగ్‌లు, లైకింగ్‌ల పేరుతో సెన్షేషన్ కోసం క్రేజీ తీవ్రమై సెల్ఫీ.. కిల్ఫీగా మారుతున్నది.