సెలెక్ట్ కమిటీకి టీడీపీ, బీజేపీ సభ్యులు ఖరారు…

|

Feb 03, 2020 | 9:18 PM

Select Committee Members: ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ చట్ట ఉప సంహరణ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపాలని శాసనమండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాక సెలెక్ట్ కమిటీ ఏర్పాటు నిమిత్తం పార్టీలు తమ సభ్యుల పేర్లను సూచించాలని కోరారు. ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్‌లు తమ సభ్యుల పేర్లను తెలియజేస్తూ కౌన్సిల్ చైర్మన్‌కు లేఖలు రాశాయి. అయితే అధికార వైసీపీ పార్టీ మాత్రం ఇంకా వారి సభ్యులను ప్రతిపాదించాల్సి […]

సెలెక్ట్ కమిటీకి టీడీపీ, బీజేపీ సభ్యులు ఖరారు...
Follow us on

Select Committee Members: ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ చట్ట ఉప సంహరణ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపాలని శాసనమండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాక సెలెక్ట్ కమిటీ ఏర్పాటు నిమిత్తం పార్టీలు తమ సభ్యుల పేర్లను సూచించాలని కోరారు. ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్‌లు తమ సభ్యుల పేర్లను తెలియజేస్తూ కౌన్సిల్ చైర్మన్‌కు లేఖలు రాశాయి.

అయితే అధికార వైసీపీ పార్టీ మాత్రం ఇంకా వారి సభ్యులను ప్రతిపాదించాల్సి ఉంది. శాసనమండలి నుంచి ఏదైనా సెలెక్ట్ కమిటీ ఏర్పాటు అయితే అందులో ఎనిమిది మంది సభ్యులు ఉంటారు. సంఖ్యాబలం ఆధారంగా ఆయా పార్టీల నుంచి సభ్యులను నియమిస్తారు. ఈ క్రమంలోనే టీడీపీ 5, బీజేపీ, పీడీఎఫ్‌ పార్టీల నుంచి ఒక్కొక్క సభ్యులు ఉంటారు. పార్టీల వారీగా సభ్యులు ఎవరంటే..

రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు..

టీడీపీ సభ్యుల జాబితా: నారా లోకేష్, అశోక్ బాబు, తిప్పేస్వామి, బీటీ నాయుడు, సంధ్యారాణి

బీజేపీ – మాధవ్

పీడీఎఫ్ – కేఎస్ లక్ష్మణరావు

 

సీఆర్డీఏ రద్దు బిల్లుకు…

టీడీపీ:దీపక్ రెడ్డి, బచ్చుల అర్జునుడు, బుద్ధా నాగ జగదీశ్వరరావు , బీదా రవిచంద్ర, గౌనివారి శ్రీనివాసులు

బీజేపీ – సోము వ్రీరాజు

పీడీఎఫ్ – ఇళ్ల వెంకటేశ్వరరావు