కరోనాపై రాజస్థాన్ ఆరోగ్యశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు

|

Nov 07, 2020 | 3:30 PM

కరోనా వైరస్ సెకండ్ వేవ్‌పై రాజస్థాన్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ రఘుశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కరోనాపై రాజస్థాన్ ఆరోగ్యశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు
Follow us on

కరోనా వైరస్ సెకండ్ వేవ్‌పై రాజస్థాన్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ రఘుశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది డిసెంబరు 15వతేదీ లోపు కరోనా రెండు దశ వ్యాప్తి చెందవచ్చని వైద్యనిపుణులు హెచ్చరించారని, ఈ సమయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని రాజస్థాన్ ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ రఘుశర్మ కోరారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఆయన ఫేస్ మాస్కులు ధరించడంతోపాటు సామాజిక దూరం పాటించాలని, తమను తాము సురక్షితంగా ఉంచుకోవడానికి పరిశుభ్రత పాటించాలని మంత్రి సూచించారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, టీకా కంటే మాస్కులు ధరించడం మంచిదని, వ్యాక్సిన్ ప్రభావం 60 శాతానికి మించదన్న ఆయన.. మాస్కులు ధరించడం వల్ల కరోనా సంక్రమణాన్ని 90 శాతం తగ్గించవచ్చన్నారు.

కరోనా సెకండ్ వేవ్ డిసెంబరు 15కు ముందే రావచ్చని నిపుణులు చెప్పారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి సలహా ఇచ్చారు. ప్రజలు కొవిడ్ మార్గదర్శకాలను సాటించాలని మంత్రి రఘుశర్మ కోరారు. శీతాకాలంలో స్వైన్ ఫ్లూ, డెంగీ, జలుబు, దగ్గు, కాలుష్యం పెరుగుతుందని, దీనివల్ల కరోనా కేసులు కూడా పెరుగుతాయని మంత్రి హెచ్చరించారు. ప్రజలు మాస్కులు ధరించి నెలరోజుల పాటు క్రమశిక్షణ పాటిస్తే కరోనా వైరస్ నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. కాగా, రాజస్థాన్ రాష్ట్రంలో ‘నో మాస్కు నో ఎంట్రీ ప్రచారం కూడా చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాలు మాత్రమే కాదు, ప్రైవేట్ కార్యాలయాలు, దుకాణాలు, వాణిజ్య సంస్థలు ప్రజలు మాస్కులు ధరించే వరకు వారిని లోపలకు ప్రవేశించడానికి అనుమతించడం లేదు.