మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చేశాయోచ్

Rafale Jets Landed Safely : ఫ్రాన్స్ నుంచి మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ చేరుకున్నాయి. వీటి రాకతో భారత వైమానిక దళం మరింత పటిష్ఠవంతంగా తయారైంది. మొదటి బ్యాచ్‌లో ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు ఇండియాకు వచ్చిన విషయం తెలిసిందే. మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. మే నెలలోనే తొలివిడత విమానాలను ఇండియాకు చేరుకోవాల్సి ఉన్నా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. ఆగష్టులో తొలివిడత ఐదు విమానాలు […]

మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చేశాయోచ్

Updated on: Nov 04, 2020 | 11:19 PM

Rafale Jets Landed Safely : ఫ్రాన్స్ నుంచి మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ చేరుకున్నాయి. వీటి రాకతో భారత వైమానిక దళం మరింత పటిష్ఠవంతంగా తయారైంది. మొదటి బ్యాచ్‌లో ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు ఇండియాకు వచ్చిన విషయం తెలిసిందే. మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది.

మే నెలలోనే తొలివిడత విమానాలను ఇండియాకు చేరుకోవాల్సి ఉన్నా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. ఆగష్టులో తొలివిడత ఐదు విమానాలు ఇండియాకు చేరుకోగా, రెండో విడతలో భాగంగా ఈరోజు మరో మూడు యుద్ధ విమానాలు ఇండియాకు చేరుకున్నాయి.

ఫ్రాన్స్ నుంచి నాన్ స్టాప్ గా ప్రయాణం చేసి ఈరోజు రాత్రి 8:14 గంటలకు భారత్ భూభాగంపై ల్యాండ్ అయ్యాయి. ఫ్రాన్స్ నుంచి నేరుగా ఈ విమానాలు గుజరాత్ లోని జామ్ నగర్ ఎయిర్ బేస్ కు చేరుకున్నాయి.